ETV Bharat / city

KALVA: 'ప్రాజెక్టుల అంశంపై జగన్, కేసీఆర్​లు కలిసి కేంద్రంతో పోరాడాలి' - తెదేపా నేత కాల్వశ్రీనివాసులు

ప్రాజెక్టుల అంశంపై తెలుగు రాష్ట్రాల ప్రజలకు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జగన్, కేసీఆర్​లు కలిసి కేంద్రంతో పోరాడాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. రాత్రులు స్నేహంగా ఉంటూ.. ఉదయం గొడవ నటిస్తున్న విషయం ప్రజలందరికీ తెలిసిందేనన్నారు.

తెదేపా నేత కాల్వ శ్రీనివాసులు
తెదేపా నేత కాల్వ శ్రీనివాసులు
author img

By

Published : Aug 3, 2021, 5:28 PM IST

ప్రాజెక్టుల అంశంపై తెలుగు రాష్ట్రాల ప్రజలకు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జగన్, కేసీఆర్​లు కలిసి కేంద్రంతో పోరాడాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. కృష్ణా జలాల వివాదంపై ఇద్దరు ముఖ్యమంత్రులు తమ నాటకాలను కట్టిపెట్టాలని హితవు పలికారు. రాత్రులు స్నేహంగా ఉంటూ ఉదయం గొడవ నటిస్తున్న విషయం ప్రజలందరికీ తెలిసిందేనన్నారు. కేఆర్​బీఎం, జీఆర్​బీం సమన్వయ కమిటీ సమావేశంలో ఏపీ హక్కుల కోసం ఎందుకు పోరాడట్లేదో జగన్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

హైదరాబాద్​లో జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో కేంద్ర గెజిట్​పై ఏపీ ఒక్క అభ్యంతరం కూడా లేవనెత్తకపోగా.. స్వాగతించటం దురదృష్టకరమన్నారు. వ్యక్తిగత అజెండా కోసం ఒకరినొకరు సహకరించుకుంటున్న కేసీఆర్, జగన్ రెడ్డిలు, రైతుల సమస్య పరిష్కారానికి మాత్రం దూరం నటిస్తున్నారని విమర్శించారు. నీటి వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోకుండా తెలుగు వారిని చులకన చేసేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

1,600 టీఎంసీల నీటి వాడకానికి సంబంధించి ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర ఇష్టానుసారం ప్రాజెక్టులు నిర్మిస్తే, తెలుగు రైతుల పరిస్థితి దుర్భరంగా మారనుందన్నారు. కర్ణాటక ఇప్పటికే ఆల్​మట్టి ఎత్తు పెంచటంతో పాటు కొత్త ప్రాజెక్టుల ప్రారంభానికి యత్నిస్తోందన్నారు. కృష్ణా మిగులు జలాల ఆధారంగా నిర్మించిన గాలేరునగరి, హంద్రీనీవా, వెలుగొండ ప్రాజెక్టులు ఏం కావాలని ప్రశ్నించారు. ఇద్దరు ముఖ్యమంత్రుల నాటకాలకు స్వస్తి చెప్పకపోతే రాయలసీమ ఎడారిగా మారే ప్రమాదం ఉందని కాలవ శ్రీనివాసులు తెలిపారు.

ఇదీ చదవండి:

Search Committees: విశ్వవిద్యాలయాల వీసీల నియామకానికి సెర్చ్ కమిటీలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.