ఒక్క ఛాన్స్ అంటూ బతిమాలి అధికారంలోకి వచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి చివరకు కరోనా మరణాలు, అవినీతి, దోపిడీలో రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలిపారని తెదేపా సీనియర్ నేత జీవీ ఆంజనేయులు విమర్శించారు. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి దోపిడీ తప్ప మరోటి కనిపించడంలేదని దుయ్యబట్టారు. ఏం సాధించారని వైకాపా శ్రేణులు, ప్రభుత్వం విజయోత్సవ సంబరాలు చేసుకుంటోందని నిలదీశారు.
ప్రజలకు కష్టాలు, సమస్యలు, మొదలై రెండేళ్లయినందుకా అని ప్రశ్నించారు. కరోనా కిట్లు, మందులు, ఇంజక్షన్లు, ఆక్సిజన్ సిలిండర్లలో కూడా పాలకుల దోపిడీ ఆగడం లేదని ధ్వజమెత్తారు. చంద్రబాబు హయాంలో ఏపీ అంటే అభివృద్ధి.. అమరావతి, పోలవరం అని చెప్పుకున్నారని.. ఇప్పుడేమో దోపిడీలు, అవినీతి, కక్షసాధింపుల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:
అసమర్థత, చేతగానితనాన్ని ప్రైవేట్ ఆసుపత్రులపై నెట్టడానికే లేఖ: నిమ్మల