వినాయకుని విగ్రహానికి అపవిత్రం జరిగిందంటూ ఫిర్యాదు చేసిన వారిపైనే.. పోలీసులు ఎదురు కేసులు పెట్టారని తెదేపా సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఏడాది సెప్టెంబర్ 12న నియోజకవర్గంలోని వినాయకుని విగ్రహానికి అపచారం జరిగిందనే ఫిర్యాదు తన దృష్టికి వచ్చిందని.. అదే విషయాన్ని స్థానిక సీఐకి తెలిపి చర్యలు తీసుకోవాలని కోరానని గోరంట్ల తెలిపారు. పోలీసుల సమక్షంలోనే విగ్రహానికి శుద్ధి చేశారని వివరించారు.
ఘటనపై స్థానికులు ఫిర్యాదు చేయగా తన పీఏ సామాజిక మాధ్యమంలో ఘటన వివరాలను పోస్ట్ చేశారని.. ఆ పోస్టులో ఎలాంటి మత విద్వేషాలను రెచ్చగొట్టే అంశాలు లేవని చెప్పారు. అసలు దోషులను వదిలేసి ఫిర్యాదు చేసిన తన పీఏను అరెస్ట్ చేయడమేంటని ప్రశ్నించారు. ఈ ఘటన వెనుక తన పాత్ర ఉందంటూ విష ప్రచారం చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎక్కడా మాట పడలేదని.. ఎన్నడూ పోలీస్ స్టేషన్ గడప తొక్కలేదని.. తొక్కాల్సిన అవసరమూ తనకు లేదని అన్నారు.
ఇదీ చదవండి: