"తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలను ఉగ్రవాదులు అంటున్నారు.. మరి, తెదేపా కార్యాలయాలపై దాడి చేసిన వాళ్లు అహింసావాదులా?" అని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. ఏ ఆధారాలున్నాయని ఉగ్రవాదులంటున్నారని మండిపడ్డారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో దేవినేని మీడియాతో మాట్లాడారు. ఈ వ్యాఖ్యలపై పోలీసులు ఎవరికి నోటీసులు ఇస్తారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
28 మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా సాధ్యమన్నారు.. మరి ఇంతవరకు ప్రత్యేక హోదాపై ఎందుకు ప్రశ్నించలేదు అని నిలదీశారు. ప్రత్యేక హోదాపై వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ఏనాడైనా మాట్లాడారా? అని ప్రశ్నించారు. 28 మంది ఎంపీలు ఉన్నా.. ప్రధాని మోదీని ఎందుకు కలవలేకపోయారని.. ప్రధానిని కలిసేందుకు సీఎం జగన్, విజయసాయి ఎందుకు భయపడుతున్నారని నిగ్గదీశారు. "ఆర్థిక ఉగ్రవాది విజయసాయిరెడ్డి వద్ద తెదేపా అధినేత చంద్రబాబు నడవడిక నేర్చుకోవాలా?" అని ధ్వజమెత్తారు. చంద్రబాబు పోరాడుతుంటే విజయసాయిరెడ్డికి వణుకొస్తోందని దేవినేని ఎద్దేవా చేశారు.
చంద్రబాబు రాష్ట్రపతిని కలిస్తే విజయసాయిరెడ్డి ఎందుకు భయం..?
చంద్రబాబు రాష్ట్రపతిని కలిస్తే.. విజయసాయిరెడ్డికి ఎందుకు చలిజ్వరం వచ్చి భయపడుతున్నారని మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ ప్రశ్నించారు. తెదేపా కార్యాలయంపై దాడి చరిత్రలో ఎన్నడూ లేని దుర్మార్గమని మండిపడ్డారు. రాష్ట్రంలో భద్రత లేనప్పుడు.. కేంద్రం జోక్యం చేసుకుని రాష్ట్రపతిపాలన విధించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అరాచకాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకే చంద్రబాబు దిల్లీ పర్యటన అని స్పష్టం చేశారు. ఎంపీగా ఏనాడైనా రాష్ట్ర సమస్యలపై నోరెత్తి, కేంద్రాన్ని నిలదీశారా? విజయసాయిని నిలదీశారు. పట్టాభిని హత్య చేసే దురాలోచన విజయసాయిరెడ్డిలో ఉందని.. హత్యచేసి తెదేపాపై ఆ నిందమోపాలనే కుట్ర ఆయన మాటల్లో వ్యక్తమైందన్నారు.
విజయసాయిరెడ్డి మాటల్లో ఆసహనం కనిపిస్తోంది: అయ్యన్నపాత్రుడు
జగన్ రెడ్డిని జైలుకి పంపడమే అజెండాగా విజయసాయిరెడ్డి దిల్లీలో తిరుగుతున్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. మోదీ, షా అపాయింట్ మెంట్ అంటూ.. హడావిడి చెయ్యడం, ముందు రోజు జగన్ రెడ్డి బాత్ రూంలో కాలు జారి పడటం.. వంటి విషయాలను వీసా రెడ్డి మర్చిపోతే ఎలా అని ఎద్దేవా చేశారు. విజయసాయిరెడ్డి మాటల్లో అసహనం కనిపిస్తోందని విమర్శించారు. వైజాగ్ నుండి హెరాయిన్, గంజాయి డ్రగ్ డాన్ జగన్ రెడ్డి పూసాలు కదులుతున్నాయని.. కేంద్ర సంస్థల ఆధ్వర్యంలో జరుగుతున్న విచారణలో జగన్ అండ్ డ్రగ్ గ్యాంగ్ త్వరలో అరెస్ట్ అవ్వడం ఖాయమన్నారు.
ఇదీ చదవండి: