విజయవాడలో నగరపాలక సంస్థ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. నగరంలోని సెంట్రల్ నియోజకవర్గంలో తెదేపా బలపరిచిన సీపీఐ అభ్యర్థి ప్రచారంలో తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమా పాల్గొన్నారు. నియోజకవర్గంలో తెదేపా హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు. సీపీఐ అభ్యర్థి నక్కా వీరభద్రరావును గెలిపించాలని కోరారు.
ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ రెడ్డి 20 నెలల కాలంలో ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేశారని మండిపడ్డారు. ఇసుక దగ్గర మొదలు పెట్టి నిత్యావసర సరకుల వరకు అన్ని రేట్లు పెంచి సామాన్యులు భరించలేని ఆర్ధిక భారాన్ని రాష్ట్ర ప్రజలపై మోపారని ఆగ్రహించారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో తెదేపాకు ఓటు వేసి వైకాపాకు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఒక్క ఛాన్స్ అని ఓట్లు వేసిన ప్రజలు, ఇప్పుడు ఇంకో అవకాశం ఇచ్చి మోసపోవద్దని ఆయన కోరారు.
ఇదీ చదవండి:
రిగ్గింగ్ జరుగుతోందని ఓ వర్గం ఆందోళన.. కాసేపు నిలిచిన పోలింగ్