ఉపాధి నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించిందని మాజీ మంత్రి, తెదేపా నేత అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. రూ.2 వేల కోట్ల ఉపాధి హామీ నిధులు పక్కదారి పట్టించారన్నారు. ఉపాధి నిధుల చెల్లింపుపై కేంద్రం అభ్యంతరం తెలపడం శుభపరిణామన్నారు. పక్కదారి పట్టిన కేంద్ర వాటా నిధులను అధికారుల నుంచి వసూలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించటం హర్షణీయమన్నారు. ఆ వ్యవహారంలో కేంద్రం చర్యలు తీసుకునేలా రాష్ట్ర భాజపా నాయకులు ఒత్తిడి తేవాలన్నారు.
ఇదీ చదవండి
Deputy CM Narayanaswamy: డిప్యూటీ సీఎం నారాయణస్వామి నుంచి ఆ శాఖ తొలగింపు