రాష్ట్రంలో ఆర్థిక, విద్యా వ్యవస్థ, వైద్య విధాన పరిషత్‌లు.. పూర్తిగా నాశనమయ్యాయని తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబు(mlc ashokbabu on aided institution) ధ్వజమెత్తారు. వైకాపా పాలనలో రాష్ట్ర అభివృద్ధి శూన్యమన్న ఆయన.. ఇప్పటికీ రాజధాని లేకపోవడం బాధాకరమన్నారు. ఎయిడెడ్ వ్యవస్థ రద్దుతో కేంద్రం ఇచ్చే 50 శాతం నిధులు ఆగిపోతాయన్నారు. ప్రభుత్వానికి అప్పగించమని చెప్పిన 12 కాలేజీల పట్ల.. ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎయిడెడ్ కాలేజీ(aided institutions)ల స్థలాలు, వాటి ఆస్తులను స్వాధీనం చేసుకొని అక్రమాలకు పాల్పడాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని ఆశోక్‌బాబు(mlc ashokbabu) ఎద్దేవా చేశారు. 9వేల మంది టీచింగ్ స్టాఫ్, 5 వేల నాన్ టీచింగ్ స్టాఫ్‌ని ప్రభుత్వం తీసుకోవడం సరికాదన్నారు. కొత్త ఉద్యోగాలు భర్తీ చేయడం లేదని మండిపడ్డారు. ఎయిడెడ్ వ్యవస్థ రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో విద్యాశాఖ మంత్రి.. తన పదవికి రాజీనామా చేయాలన్నారు.
ఎయిడెడ్ వ్యవస్థ రద్దు చేస్తూ జారీ చేసిన జీవో 42ను ఉపసంహరించుకోవాలి. అలాగే ఎయిడెడ్ వ్యవస్థతోపాటు ఇతర విద్యాస్థంస్థల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలి. ఆ విద్యా సంస్థల ఆస్తులను స్వాధీనం చేసుకొని అక్రమాలకు పాల్పడేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తుంది. ఎయిడెడ్ వ్యవస్థ రద్దుతో కేంద్రం ఇచ్చే 50 శాతం నిధులు ఆగిపోతాయి. రాష్ట్రంలో ఆర్థిక, విద్యా వ్యవస్థలు పూర్తిగా నాశనమయ్యాయి. రాష్ట్ర అభివృద్ధి శూన్యం.. ఇప్పటికీ రాజధాని లేకపోవడం బాధాకరం. -అశోక్‌బాబు, ఎమ్మెల్సీ
ఇదీ చదవండి..
TIRUMALA: ఆన్లైన్లో శ్రీవారి సర్వదర్శనం టికెట్లు.. అరగంటలోపే ఖాళీ