న్యాయమూర్తి రామకృష్ణ సోదరుడు రామచంద్రపై జరిగిన దాడిపై నిజనిర్ధరణ కమిటీ ఏర్పాటు చేసినట్లు తెదేపా రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు తెలిపారు. కమిటీ సభ్యులుగా పాశం సునీల్ కుమార్, నెలవల సుబ్రహ్మణ్యం, పంతగాని నరసింహ ప్రసాద్, జేడీ రాజశేఖర్, ఏ. పీటర్లను నియమించామన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రామచంద్రను కమిటీ సభ్యులు పరామర్శించినున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని కళా... విమర్శించారు. దళితుల హక్కులను కాలరాస్తూ... ఉద్దేశపూరిత దాడులకు పాల్పడటం దుర్మార్గమని మండిపడ్డారు. 16 నెలల కాలంలో 152కు పైగా దాడులు జరిగాయని.., దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవటంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
ఇదీచదవండి