ETV Bharat / city

ఎంపీ మాధవ్‌ని సస్పెండ్ చేయకపోతే.. జగనే సస్పెండ్ అవుతారు: ఆలపాటి

ex minister alapati: హిందూపురం వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపామనేది బూటకమని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆరోపించారు. మార్ఫింగ్ జరిగిందో లేదో అరగంటలో నిర్దరించే టెక్నాలజీ వచ్చిందని.. ధైర్యముంటే హైదరాబాద్ సెంట్రల్ డిజిటల్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపాలని డిమాండ్​ చేశారు.

ALAPATI
ALAPATI
author img

By

Published : Aug 8, 2022, 3:43 PM IST

MP Gorantla video issue: ఎంపీ మాధవ్‌ని సస్పెండ్ చేయకపోతే జగనే సస్పెండ్ అవుతారని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్​ హెచ్చరించారు. ఎంపీ వీడియో ఫోరెన్సిక్ ల్యాబ్​కు పంపామనేది బూటకమని.. మార్ఫింగ్ జరిగిందో లేదో అరగంటలో నిర్ధారించే టెక్నాలజి వచ్చిందన్నారు. జగన్​కి ధైర్యం ఉంటే హైదరాబాద్​లోని సెంట్రల్ డిజిటల్ ఫోరెన్సిక్ ల్యాబ్​కు పంపాలని సవాల్‌ చేశారు. అత్యాచారం జరిగిన చోటుకి హోంమంత్రి వెళ్లాలన్నా.. సీఎం అనుమతి కావాల్సి రావటం పరిపాలనా దుస్థితని దుయ్యబట్టారు. వార్డు మెంబర్​గా కూడా పనికిరాని వ్యక్తిని ఎంపీ చేసి రాష్ట్ర పరువు తీశారని విమర్శించారు. రాష్ట్ర పరువు కాపాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి జగన్​పై ఉందని ఆలపాటి అన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.