ముఖ్యమంత్రి జగన్ ప్రజలను ఉద్దేశించి లైవ్లో మాట్లాడలేరా అని తెదేపా ప్రశ్నించింది. ముఖ్యమంత్రి ప్రసంగాన్ని ముందే చిత్రీకరించి... ఎడిట్ చేసి ప్రసారం చేశారని విమర్శించింది. జగన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా మాట్లాడారనుకుంటే అది పొరబడ్డట్టేనని స్పష్టం చేసింది. అది ఎడిట్ చేసిన వీడియో అని తేల్చి చెప్పిన తెలుగుదేశం... సీఎం కనీసం లైవ్ ప్రెస్మీట్లో కూడా మాట్లాడలేరని ఎద్దేవా చేసింది. లైవ్లో మాట్లాడితే తప్పులు దొర్లుతాయనే వీడియో పెట్టి మేనేజ్ చేశారని దుయ్యబట్టింది. సీఎం ప్రసంగం వీడియోకు సంబంధించి రెండు నిర్దిష్ట సమయాల్లో తీసిన స్క్రీన్ షాట్లను ట్విట్టర్లో పెట్టింది. వాటిని పరిశీలిస్తే వీడియో నిడివి 23నిమిషాలుందని, ముఖ్యమంత్రి చేతికి పెట్టుకున్న గడియారం చూపిస్తున్న సమయాల్లోని వ్యత్యాసం 26 నిమిషాలుందని తెలిపింది. దీన్ని బట్టి వీడియోను మధ్యాహ్నమే రికార్డ్ చేసి 3 నిమిషాలు ఎడిట్ చేసి ప్రసారం చేసినట్లు అర్ధమవుతోందని తెదేపా పేర్కొంది.
ఇవీ చదవండి...ఆగని డోలీ మోతలు...ముందస్తు ప్రసవమై బిడ్డ మృతి