స్థానిక సంస్థల ఎన్నికల్లో రౌడీయిజం, బెదిరింపులు, అధికార దుర్వినియోగం, ప్రలోభాలు ఉన్నప్పటికీ పార్టీ శ్రేణులు గట్టిగా పోరాడారని తెదేపా అధినేత చంద్రబాబు అభిప్రాయపడ్డారు. తెదేపా నేతలు, కార్యకర్తలు పార్టీ విజయం కోసం ఎంతో కష్టపడ్డారన్నారు. కొన్నిచోట్ల ప్రాణాలు సైతం పణంగా పెట్టి పార్టీకి అండగా నిలిచారని.. వారి పోరాటస్ఫూర్తికి వందనాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ఫలితాల విషయానికి వస్తే.. నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని ట్విట్టర్లో వెల్లడించారు. ప్రజా సమస్యల పరిష్కారం, రాష్ట్ర భవిష్యత్తు లక్ష్యంగా ముందుకు కొనసాగుదామని పిలుపునిచ్చారు. ఇదే స్ఫూర్తితో పనిచేస్తే రాబోయే రోజుల్లో విజయం మనదే అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: