ETV Bharat / city

TDP News: కల్తీ సారా, జె-బ్రాండ్లను నిషేధించాలంటూ.. రాష్ట్రవ్యాప్త నిరసనలకు తెదేపా పిలుపు

TDP Call Statewide Protests: రాష్ట్రంలో కల్తీ సారా, మద్యం షాపుల్లో జె- బ్రాండ్స్​ను నిషేధించాలని డిమాండ్​తో రాష్ట్రవ్యాప్త నిరసనలకు తెదేపా పిలుపునిచ్చింది. ఈమేరకు ఈనెల 19, 20 తేదీల్లో పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నారు.

tdp agitation over ban Kalti Sara and liquor
ఈనెల 19న రాష్ట్రవ్యాప్తంగా తెదేపా నిరసనలు
author img

By

Published : Mar 17, 2022, 8:19 PM IST

రాష్ట్రంలో కల్తీ సారా నిర్మూలన, మద్యం షాపుల్లో జే-బ్రాండ్స్‌ను నిషేధించాలని డిమాండ్​తో తెలుగుదేశం పార్టీ ఆందోళనలకు సిద్ధమైంది. అధిష్ఠానం అదేశాల మేరకు ఈనెల 19, 20 తేదీల్లో.. అన్ని గ్రామాలు, మండల కేంద్రాల్లో పార్టీ శ్రేణులు నిరసనలు చేపట్టనున్నారు.

నాణ్యత లేని, కల్తీ మద్యం వల్ల ప్రాణాలు పోవడంతోపాటు జనారోగ్యం దెబ్బతింటుందని.. వీటిని వెంటనే నిషేధించాలని తెదేపా నేతలు డిమాండ్ చేశారు. జే-బ్రాండ్స్ మద్యంతో మహిళల తాళిబొట్లు తెంపేస్తున్నారని.. ఇంత జరుగుతున్నా కమీషన్ల కోసమే జగన్ సర్కార్ పనిచేస్తుందని ఆరోపించారు. కల్తీ సారా, జె బ్రాండ్స్​పై అసెంబ్లీలో ఎమ్మెల్యేల పోరాటానికి మద్దతుగా.. వాడవాడలో యుద్దానికి తెదేపా సిద్దమైందన్నారు.

ఇదీ చదంవడి:

BJP: 'రాష్ట్రంలో నాయకుడు మద్యం అమ్ముతుంటే.. ఎమ్మెల్యేలు సారా కాస్తున్నారు'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.