కాపులకు ఆర్థిక సాయం విషయంలో తెదేపా కమిటీని నియమించింది. కాపు నేస్తం పథకంపై చర్చకు సిద్ధమని కమిటీ సభ్యులు ప్రభుత్వానికి సవాల్ విసిరారు. కాపులకు ఎవరి హయాంలో ఎంత ఖర్చు చేశారో తేల్చాలని డిమాండ్ చేశారు. కాపు నేస్తంపై ప్రభుత్వం కాకి లెక్కలు చెపుతోందని తెదేపా అధికార ప్రతినిధి బొండా ఉమా విమర్శించారు. కాపు నేస్తం ముమ్మాటికి కాపు ద్రోహమేనని ధ్వజమెత్తారు.
కాపులు కోరేది గొంతెమ్మ కోరికలు కాదని.. గతంలో వైకాపా ఇచ్చిన హామీలను నెరవేర్చమంటున్నారని తేల్చిచెప్పారు. 50 లక్షల మంది కాపు మహిళల్లో 2 లక్షల 36వేల మందికి మాత్రమే 15 వేలు ఇవ్వటం ద్రోహం కదా అని ప్రశ్నించారు. కాపులకు న్యాయం చేయాలని అడిగితే తప్పుడు కేసులు పెట్టమని పోలీసులకు ఆదేశాలిస్తున్నారని ఆరోపించారు. కాపు హక్కులు కోసం పవన్ కల్యాణ్ మాట్లాడితే ఆయన మీద దాడి చేస్తున్నారని దుయ్యబట్టారు.
ఇదీ చదవండి: పీవీ ప్రత్యేకం: తెలుగు కీర్తి.. పాములపర్తి