ఆక్వా రైతులకు జరుగుతున్న అన్యాయంపై తాను దాఖలు చేసిన అఫిడవిట్‌కు హైకోర్టు సానుకూలంగా స్పందించిందని టీడీఎల్పీ ఉపనేత నిమ్మల రామానాయుడు తెలిపారు. 10 రోజుల్లో నివేదిక సమర్పించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించిందన్నారు. ఆక్వా ఉత్పత్తులను ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయాలని న్యాయస్థానాన్ని తాను కోరినట్లు రామానాయుడు చెప్పారు. వంద కౌంట్ రొయ్యల ధర కంటే కేజీ వంకాయల ధర ఎక్కువగా ఉందన్న రామానాయుడు... ప్రభుత్వ ప్రకటనలు క్షేత్రస్థాయిలో అమలు కాక రైతులు విలవిలలాడుతున్నారని చెప్పారు.
ఇవీ చదవండి: