పార్లమెంటులో వైకాపా ఎంపీల బలం కేసుల మాఫీ, పైరవీలకు తనఖా పెట్టడానికేనని టీడీఎల్పీ ఉపనేత నిమ్మల రామానాయుడు విమర్శించారు. వైకాపాకు 30 మంది ఎంపీలున్నా రాష్ట్ర ప్రయోజనాలు శూన్యమని ఆయన మండిపడ్డారు. సీబీఐ, ఈడీ కేసుల్లో సహనిందితుడైన వ్యక్తికి రాజ్యసభ సీటు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. దళితుల ఓట్లతో అధికారం దక్కించుకుని రాజ్యసభకు ఒక్కరికీ అవకాశమివ్వలేదన్న ఆయన... ఏడాది కాలంలో ప్రత్యేక హోదా, రైల్వే జోన్, మెట్రో రైలు లాంటివి ఏమైనా సాధించారా అంటూ మండిపడ్డారు.
ఇవీ చదవండి: 'శాసనసభ నిర్ణయమే అంతిమం..మండలి వ్యతిరేకిస్తే పట్టించుకోనవసరం లేదు'