బ్రహ్మంగారిమఠంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు తాళ్లపాలెం శైవక్షేత్రం స్వామీజీ శివస్వామి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావును కలిశారు. తాము విశ్వధర్మ పరిరక్షణ సమితి తరఫున 152 పేజీల నివేదికను మంత్రికి అందజేశామని, పీఠాధిపతి విషయంలో నెలకొన్న సందిగ్ధతపై త్వరలో ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నామని శివస్వామి ఆశాభావం వ్యక్తం చేశారు.
మఠంలో నెలకొన్న అన్ని వివాదాలు సమసిపోయి పూర్వవైభవం నెలకొంటుందని శివస్వామి ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండీ... YSR cheyutha: కుటుంబానికి మహిళలే రథసారధులు: సీఎం జగన్