గతేడాది జూన్లో హన్మకొండలో చిన్నారిపై అత్యాచారం, హత్య చేసిన దోషికి విధించిన యావజ్జీవ శిక్షను సుప్రీంకోర్టు సమర్థించింది. ట్రయల్ కోర్టు విధించిన ఉరిశిక్షను తెలంగాణ హైకోర్టు యావజ్జీవ శిక్షగా మార్చింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ... తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
మరణశిక్ష విధిస్తే... సమాజంలో నేరస్థులకు సరైన సంకేతాలు వెళ్తాయని తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదించారు. హైకోర్టు తీర్పు కూడా దోషికి పూర్తిస్థాయిలో శిక్ష విధించినట్టుగానే ఉందన్న జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ధర్మాసనం... తెలంగాణ ప్రభుత్వ పిటిషన్ను కొట్టేసింది. ఈ మేరకు లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేసింది..
ఇదీ చూడండి భారత్-చైనా సరిహద్దు ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన కల్నల్ సంతోష్