ఏపీలో సెప్టెంబరు-నవంబరు వరకు 5,188 ప్రమాదాలు జరిగినట్టు సుప్రీంకోర్టు రహదారి భద్రతా నివేదికలో తెలిపింది. ప్రమాదాల్లో 2,073 మంది మృతి చెందినట్లు పేర్కొంది. గతేడాది 4,761 రహదారి ప్రమాదాల్లో 1,734 మంది మృతి చెందినట్లు తెలిపింది. 2019 సెప్టెంబరు-నవంబరుతో పోలిస్తే 19.4 శాతం మేర మరణాలు పెరిగాయి.
మార్చి-జూన్ మధ్య లాక్‌డౌన్ కారణంగా ప్రమాదాలు 78 శాతం తగ్గినట్లు వెల్లడించింది. ఆంక్షలు తొలగించిన కొద్దీ ప్రమాదాలు పెరిగాయని నివేదికలో స్పష్టం సుప్రీంకోర్టు రహదారి భద్రతా కమిటీ తెలిపింది. వ్యక్తిగత వాహనాలు భారీగా పెరగటమే ప్రమాదాలకు కారణమని వెల్లడించింది. కరోనా భయంతో ప్రజారవాణా వినియోగం భారీగా తగ్గినట్లు స్పష్టం చేసింది. ప్రమాదాలకు కారణమవుతున్న బ్లాక్‌స్పాట్లను నివారించాల్సిందిగా కమిటీ సూచించింది. రహదారి భద్రతా ఆడిట్‌ను తప్పనిసరి చేయాలని నివేదికలో కమిటీ స్పష్టం చేసింది.
ఇదీచ దవండి: దేశవ్యాప్తంగా హైకోర్టు సీజేలు, జడ్జీలు బదిలీ