ETV Bharat / city

రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా కె.మన్మథరావు..సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు - రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా కె.మన్మథరావు వార్తలు

రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా కె.మన్మథరావు పేరును సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. అదే విధంగా బీఎస్‌.భానుమతికి హైకోర్టు జడ్జిగా పదోన్నతి ఇవ్వాలని సిఫారసు చేసింది.

రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా కె.మన్మథరావు

author img

By

Published : Nov 15, 2021, 10:57 PM IST

Updated : Nov 16, 2021, 5:10 AM IST

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు ఇద్దరు న్యాయమూర్తుల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసింది. జ్యుడిషియల్‌ అధికారిణి బీఎస్‌ భానుమతి, న్యాయవాది డాక్టర్‌ కె.మన్మథరావు పేర్లకు కొలీజియం ఆమోదముద్ర వేసింది. ది. ఈనెల 11న సమావేశమైన సుప్రీం సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని కొలీజియం నిర్ణయించింది.

* బీఎస్‌ భానుమతి ప్రస్తుతం ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌గా సేవలందిస్తున్నారు. ఆమె స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు. న్యాయవాది, స్వాతంత్య్ర సమరయోధుడు బీకేవీ శాస్త్రి కుమార్తె ఆమె. రాజమహేంద్రవరం, కొవ్వూరులలో విద్యాభ్యాసం చేసిన ఆమె న్యాయవాదిగా పదేళ్లపాటు ప్రాక్టీసు చేశారు. 2002 ఆగస్టు 21న నేరుగా జిల్లాజడ్జిగా ఎంపికయ్యారు. వరంగల్‌, శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాలలో సేవలందించారు. 2020 జూన్‌లో ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌గా నియమితులయ్యారు.

* డాక్టర్‌ కె.మన్మథరావు స్వస్థలం ప్రకాశం జిల్లా సింగరాయకొండ. నాగార్జున, ఆంధ్రా, ఉస్మానియా, హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలలో విద్యాభ్యాసం చేశారు. ఆంధ్రా వర్సిటీలో పీహెచ్‌డీ చేశారు. 1991 జూన్‌ 25న న్యాయవాదిగా నమోదయ్యారు. కందుకూరులో సొంతంగా ప్రాక్టీసు చేశారు. 1999లో హైదరాబాద్‌కు మారి అక్కడ న్యాయవాదిగా కొనసాగారు. సీబీ ఎక్సైజ్‌ సీనియర్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌గా, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌, డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌లకు స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా, ప్యానల్‌ కౌన్సిల్‌గా సేవలందించారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ విభాగాలు, ఆర్థిక సంస్థలు, కంపెనీలకు స్టాండింగ్‌ కౌన్సిల్‌గా పనిచేస్తున్నారు.

ఇదీ చదవండి: Municipal elections: ఉద్రిక్తతల మధ్య పురపోరు.. కుప్పంలో దొంగ ఓటర్లను అడ్డుకున్న తెదేపా

Last Updated : Nov 16, 2021, 5:10 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.