రాష్ట్రంలో ఈ నెల 28 వరకు ఉష్ణగాలుల ప్రభావం ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. 45 మండలాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే.. అవకాశం ఉందని హెచ్చరించింది. ఇప్పటికే... పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు చెప్పింది. 501 చోట్ల 40 నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు, 603 చోట్ల 35 నుంచి 40 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఆయా ప్రాంతాల్లో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతల వివరాలు:
- నిడదవోలులో 45.1, ద్వారకా తిరుమలలో 45 డిగ్రీలు
- కొవ్వూరులో 45.7, చాగల్లు 45, ఉండి 46, అత్తిలిలో 45.6 డిగ్రీలు
- ఏలూరు 45, రాజమహేంద్రవరంలో 44.5 డిగ్రీలు
- కోరుకొండ 45.5, రావులపాలెం 43, అమలాపురంలో 42 డిగ్రీలు
- విజయవాడలో 46.15, పెడన 46.14, పామర్రులో 45.5 డిగ్రీలు
- నూజివీడు 45.65, మంగళగిరి 45.4, సత్తెనపల్లెలో 45.3 డిగ్రీలు
- వేమూరు 46, జంగమహేశ్వరం 45, గుంటూరులో 44.1 డిగ్రీలు
- బాపట్ల 45, దొనకొండ 45, ఒంగోలులో 42 డిగ్రీలు
- చీమకుర్తి 45.3, దర్శి 44, నెల్లూరులో 43.7 డిగ్రీలు
- సూళ్లూరుపేట 41, ఓబులవారిపల్లి 40, కడపలో 41 డిగ్రీలు
- తిరుపతి 41.6, పాకాల 42.1, చిత్తూరులో 40.4 డిగ్రీలు
- కర్నూలులో 43, ఓర్వకల్లు 42, అనంతపురంలో 41 డిగ్రీలు
- యాడికిలో 40.3, శ్రీకాకుళం 43, ఆముదాలవలసలో 40.6 డిగ్రీలు
- విజయనగరం 43, గజపతినగరం 42, విశాఖలో 38.6 డిగ్రీలు
- అనకాపల్లిలో 40.1, నర్సీపట్నంలో 41.2 డిగ్రీలు
ఇదీ చదవండి: