రోటరీ క్లబ్ , కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ వారు విద్యార్దులకు ఓ వినూత్న బహుమతిని ఇచ్చారు. నగర శివారు అంబాపురం గ్రామ పరిధిలో ఉన్న 8వ శతాబ్దం నాటి శ్వేతాంబర జైన రాతి దేవాలయానికి హెరిటేజ్ ట్రెక్ నిర్వహించారు. నగరానికి కూతవేటు దూరంలో ఉన్న చెక్కు చెదరని జైన దేవాలయాన్ని చూసి విద్యార్థులు ఆశ్చర్యపోయారు. జైనదేవాలయ విశేషాలను క్లబ్ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణ, వారసత్వ సంపద, అడ్వంచర్ టూరిజం పై అవగాహన పెరగాలంటే..ఇలాంటి కార్యక్రమాలను విద్యార్దుల్లోకి తీసుకెళ్లాలని క్లబ్ నిర్వహకులు తెలిపారు.
ఇదీచదవండి