లాక్ డౌన్ అనంతరం క్రమంగా రైళ్లను పట్టాలెక్కిస్తోన్న రైల్వే శాఖ ప్రయాణికుల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. రైలు ప్రయాణ సమయంలో ఎవరూ కరోనా వైరస్ బారిన పడకుండా ఉండేలా నిబంధనలు రూపొందించింది. దీనికోసం ప్రయాణికులు పాటించాల్సిన నిబంధనలను విడుదల చేసింది.
నిర్లక్ష్యంగా వ్యవహరించి కరోనా వ్యాప్తికి కారకులైన వారికి జైలు శిక్ష లేదా జరిమానా వేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రైల్వే చట్టంలోని సెక్షన్ 145, 153, 154 కింద చర్యలు తీసుకోవాలని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌కు మార్గదర్శకాలు జారీ చేసింది. దసరా పండుగకు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేస్తోన్న రైల్వే శాఖ.. రైళ్లలో వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఈ తరహా కఠిన చర్యలు తీసుకుంటోంది.
ప్రయాణికులు పాటించాల్సిన నిబంధనలు
- మాస్కు ధరించాలి
- భౌతిక దూరం పాటించాలి
- కరోనా నిర్ధరణ కోసం నమూనాలు ఇచ్చి ఫలితం రాకుండా రైల్వేస్టేషన్‌కు రాకూడదు
- స్టేషన్ పరిసర ప్రాంతాల్లో బహిరంగంగా ఉమ్మరాదు
- స్టేషన్ లేదా రైలులో అపరిశుభ్ర వాతావరణం సృష్టించకూడదు
- రైల్వేశాఖ జారీచేసిన మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలి
- ఎవరైనా వ్యక్తియొక్క భద్రతకు అపాయం కలిగించేలా వ్యవహరించరాదు
- ఉద్దేశపూర్వకంగా నిబంధనలు ఉల్లఘించకూడదు.
ఇవీ చదవండి..