ర్యాపిడ్ కిట్ల కొనుగోళ్లకు సంబంధించి అవసరమైతే శ్వేతపత్రం విడుదల చేస్తామని మంత్రి ఆళ్ల నాని ప్రకటించారు. కిట్ల కొనుగోలు నిబంధనల ప్రకారం... దేశంలో ఏ రాష్ట్రానికైనా ధర తగ్గిస్తే.. అంతే చెల్లిస్తామని ఒప్పంద పత్రంలో స్పష్టంగా ఉందన్నారు. మొత్తం 2 లక్షల కిట్లకుగానూ ప్రస్తుతం 25 శాతం సొమ్ము చెల్లించామని... తగ్గింపు ధరల ప్రకారమే మిగిలిన ప్రక్రియ పూర్తిచేస్తామని చెప్పారు.
ఐసీఎంఆర్, కర్ణాటక ప్రభుత్వం మనకంటే అధిక ధరకు కిట్లు కొంటున్నాయన్నారు. అన్ని రాష్ట్రాల కంటే ముందే టెస్టింగ్ కిట్లు తెప్పించి పరీక్షలు చేస్తున్న ప్రభుత్వంపై ఆరోపణలు మానుకుని... విపత్తును ఎదుర్కోవడంలో ప్రతిపక్షాలు సహకరించాలని మంత్రి కోరారు.
పరీక్షల సామర్థ్యం పెరగడం వల్లే ఎక్కువ కేసులు బయటపడుతున్నాయని ఆళ్ల నాని తెలిపారు. ఈ విషయంలో ఆందోళన అవసరం లేదని స్పష్టం చేశారు.
ఇదీచదవండి