ETV Bharat / city

Step father: మానవత్వం మరిచి... కూతురిపై మృగంలా ప్రవర్తించి - విజయవాడ నేరవార్తలు

Video shoot: తనకు, తన బిడ్డకు తోడుగా ఉంటాడనుకున్న ఆ తల్లి నమ్మకాన్ని తుంచేశాడు.. కూతురికి ప్రేమను, అప్యాయతను పంచాల్సినవాడే తనలోని మృగపు లక్షణాన్ని ప్రదర్శించాడు.. బిడ్డను ఇతరుల అసభ్య చూపులను నుంచి కాపాడాల్సినవాడే సభ్యసమాజం తలవంచుకునేలా ప్రవర్తించాడు.. రక్షణగా నిలవాల్సినవాడే రాక్షసుడిగా వ్యవహరించాడు.. మావవత్వం లేకుండా కూతురు వరుసైన బాలిక పట్ల తన వికృత చేష్టలు చూపించాడు.. ఈ దారుణమై ఘటన ఎక్కడ జరిగిందంటే..

step father misbehaviour
సవతి తండ్రి అసభ్య ప్రవర్తన
author img

By

Published : Feb 12, 2022, 12:49 PM IST

Updated : Feb 12, 2022, 1:02 PM IST

Step father misbehaviour: వావి వరుసలు మరచి కూతురు వరుసైన బాలిక పట్ల అనుచితంగా ప్రవర్తించాడో సవతి తండ్రి. బాత్‌రూమ్‌లో చరవాణిని రహస్యంగా ఉంచి బాలిక స్నానం చేస్తున్న దృశ్యాలను చిత్రీకరించాడు. చరవాణిలో వీడియోను గమనించిన తల్లి రెండో భర్త వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేసి.. పోలీసులను ఆశ్రయించింది. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

విజయవాడ వన్‌టౌన్‌ గట్టు వెనుక ప్రాంతానికి చెందిన ఒక మహిళకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తె 9వ తరగతి చదువుతోంది. భర్తతో విభేదాల కారణంగా అతనితో విడిపోయి రెండో వివాహం చేసుకున్నారు. రెండో భర్త, పిల్లలతో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఈ క్రమంలో ఈ నెల 4న రాత్రి 9.30 గంటల సమయంలో సవతి తండ్రి ఇంట్లోని బాత్‌రూమ్‌లో చరవాణిని వీడియో మోడ్‌లో ఉంచి వరుసకు కూతురైన బాలిక స్నానం చేస్తుండగా చిత్రీకరించాడు. ఫిబ్రవరి 10న ఉదయం 10 గంటల సమయంలో మహిళ తన రెండో భర్త చరవాణిలోని ఫొటోలు చూస్తుండగా.. కుమార్తె స్నానం చేస్తున్న వీడియో కనిపించింది. ఈ విషయమై రెండో భర్తతో గొడవ పడింది. అనంతరం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ మేరకు పోలీసులు వివరాలు వెల్లడించారు.

ఇదీ చదవండి:

Bomb Blast: మామిడిపాలెం క్వారీలో బాంబు పేలుడు... ఒకరు మృతి

Last Updated : Feb 12, 2022, 1:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.