ETV Bharat / city

NTR University Funds Transfer: ఎన్టీఆర్‌ వర్సిటీ నిధులు తీసుకునేందుకు ప్రభుత్వ ప్రయత్నాలు ముమ్మరం

NTR University Fund Transfer: విజయవాడలోని ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయ నిధులను తీసుకునే ప్రయత్నాలను రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరం చేసింది. బ్యాంకుల నుంచి డిపాజిట్లు తీసి, రాష్ట్ర ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్​లో డిపాజిట్లు చేయాలని ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందని వర్సిటీ ఉద్యోగులు తెలిపారు. ఈ క్రమంలో ఉద్యోగ సంఘాలు నేడు సమావేశమై.. దానిపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయ నిధులను తీసుకునే ప్రతయ్నం
NTR University Funds Transfer
author img

By

Published : Nov 29, 2021, 8:18 AM IST

Updated : Nov 29, 2021, 12:46 PM IST

NTR University Fund Transferతీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న రాష్ట్ర ప్రభుత్వం... అవకాశం ఉన్న ప్రతిచోట నిధులను తీసుకునేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ(state govt efforts to transfer funds for NTR Health University) నిధులను సైతం తీసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. వర్సిటీకి చెందిన బ్యాంకు డిపాజిట్లు తీసి...రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కార్పొరేషన్‌లో డిపాజిట్ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఈ నెల 25న జారీచేసిన జీవో 1998 ఉత్తర్వులు అనుసరించి వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం విశ్వవిద్యాలయంపై ఒత్తిడి తెస్తోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈనెల 13న సమావేశమైన వర్సిటీ పాలకమండలి.. విశ్వవిద్యాలయం నిధులను వడ్డీ ఎక్కువగా ఇచ్చే బ్యాంకుల్లోనే డిపాజిట్ చేయాలని తీర్మానించింది. దీంతో ఈనెల 25న ఆర్థికశాఖ పేరిట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఓ ఉత్తర్వు జారీ చేశారు. జాతీయ బ్యాంకుల్లోని డిపాజిట్లు దుర్వినియోగం అవుతున్నందున...ఫైనాన్సియల్ సర్వీసెస్ కార్పొరేషన్‌లో డిపాజిట్ చేయాలని(Order to Funds Transfer Financial Services Corporation from ntr university) ఆదేశించారు. ఈ మేరకు వెంటనే నిధులు మళ్లించాలని ప్రభుత్వం నుంచి 2 రోజులుగా ఒత్తిళ్లు పెరిగాయని వర్సిటీ సిబ్బంది తెలిపారు. సుమారు 400 కోట్లు ఇప్పటికిప్పుడు వెనక్కి తీసుకుంటే వర్సిటీకి నష్టం వస్తుందని వర్సిటీ అధికారులు తెలిపారు. దీంతో ఉద్యోగ సంఘాలు నేడు సమావేశమై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఇదీ చదవండి..: Financial Burden on AP : రాష్ట్రంపై ఆర్థిక భారం రూ.6.82 లక్షల కోట్లు?

Last Updated : Nov 29, 2021, 12:46 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.