ETV Bharat / city

స్వస్థలాలకు శ్రీనగర్​ ఎన్​ఐటీ విద్యార్థులు - nit sutudents

శ్రీనగర్​ ఎన్​ఐటీలోని తెలుగు విద్యార్థులు క్షేమంగా స్వస్థలాలకు బయల్దేరారు. దిల్లీ రైల్వే స్టేషన్లో ఏపీ భవన్ సిబ్బంది విద్యార్థులకు భోజనాలు, మందుల సదుపాయం కల్పించారు.

స్వస్థలాలకు శ్రీనగర్​ ఎన్​ఐటీ విద్యార్థులు
author img

By

Published : Aug 5, 2019, 5:07 AM IST

Updated : Aug 5, 2019, 11:19 AM IST

జమ్ముకశ్మీర్​లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో శ్రీనగర్​ నిట్​లోని తెలుగు విద్యార్థులు స్వస్థలాలకు బయల్దేరారు. జమ్మూ నుంచి శనివారం రాత్రి 12 గంటలకు అండమాన్​ ఎక్స్​ప్రెస్​లో బయలుదేరిన 90 మంది విద్యార్థులు ఆదివారం మధ్యాహ్నం దిల్లీకి చేరుకున్నారు. దిల్లీ రెల్వేస్టేషన్​లో వీరికి ఏపీభవన్​ అధికారులు భోజనాలు, మందులతోపాటు దారి ఖర్చుల కోసం కొంత నగదు అందించారు. ఏపీ భవన్​ రెసిడెంట్​ కమిషనర్​ ప్రవీణ్​ ప్రకాశ్​ వారితో మాట్లాడారు. ఆదివారం రాత్రి 10 గంటలకు మరికొంతమంది తెలుగు విద్యార్థులు దిల్లీకి చేరుకున్నారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్​రెడ్డి సూచనల మేరకు తెలంగాణ భవన్​ రెసిడెంట్​ కమిషనర్​ వేదాంతం గిరి, ఏపీ భవన్​ రెసిడెంట్​ కమిషనర్​ ప్రవీణ్​ ప్రకాశ్​ విద్యార్థులను కలిసి యోగక్షేమాలు కనుక్కున్నారు. అనంతరం వీరికి సదరన్​ హోటల్​లో బస ఏర్పాట్లు చేశారు. విద్యార్థులు నేడు ఉదయం స్వస్థలాలకు పయనం కానున్నారు.

ఇదీ చదవండి :

విశాఖ-ఎల్​టీటీ ఎక్స్​ప్రెస్ రైలు​ రద్దు

Intro:మూడు రోజులపాటు పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు విచ్చేసిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు పార్టీ అభిమానులు పెనుగొండ మండలం సిద్ధాంతం వద్ద జాతీయ రహదారిపై ఘన స్వాగతం పలికారు .ఆదివారం మధ్యాహ్నం నాలుగు గంటలకు రాజమండ్రి విమానాశ్రయానికి వచ్చిన పవన్ కళ్యాణ్ రహదారి మార్గంలో భారీ కాన్వాయ్తో సిద్ధాంతం వద్ద గోదావరి వారధి దాటి పశ్చిమ లో అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా గా జిల్లాకు చెందిన ఆ పార్టీ నాయకులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం పెనుగొండ ,ఆలమూరు, వీరవాసరం మీదుగా భీమవరం వెళ్లారు.Body:ArunConclusion:8008574468
Last Updated : Aug 5, 2019, 11:19 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.