మహిళల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు.. విజయవాడలో "శ్రీమతి అమరావతి" పోటీలు నిర్వహించారు. నగరంలోని ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన ఈ ట్రెడిషనల్ ఫ్యాషన్ షో(fashion show in vijayawada)లో ఔత్సాహికులు పాల్గొన్నారు.
ఈ ఫ్యాషన్ షోలో సుమారు 50 మందికి పైగా మహిళలు పాల్గొన్నారు. మహిళల అలంకరణ, నడవడిక, సమయస్ఫూర్తి తదితర అంశాల్లో న్యాయ నిర్ణేతలు ప్రశ్నలు వేశారు. వీరిలో 25 మందిని తుది పోటీలకు ఎంపిక చేసినట్లు ఫ్యాషన్ షో నిర్వాహకుడు ప్రదీప్ చౌదరి తెలిపారు. వచ్చే నెలలో 'శ్రీమతి అమరావతి' ఫైనల్స్ నిర్వహిస్తామని చెప్పారు.
ఈ పోటీల్లో విజేతగా నిలిచిన వారికి జ్ఞాపికలతో పాటు నగదు బహుమతి అందిస్తామని వెల్లడించారు.
ఇదీచదవండి.