ETV Bharat / city

'ఒత్తిడిని జయించాలంటే క్రీడల్లో ప్రోత్సహించాలి'

author img

By

Published : Mar 1, 2020, 2:51 PM IST

సమాజంలో మంచి పౌరులుగా జీవించేందుకు యువత చదువుతో పాటు క్రీడల్లో కూడా తమ ప్రతిభ చూపాలని విజయవాడ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ నాగార్జునరెడ్డి అన్నారు. విజయవాడ పీబీ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వార్షిక క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

Vijayawada PB Siddhartha Arts and Science College Annual Sports Day
విజయవాడ పీబీ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వార్షిక క్రీడా దినోత్సవం

విజయవాడ పీబీ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వార్షిక క్రీడా దినోత్సవంగా కళాశాలలో నిర్వహించిన క్రీడా పోటీల్లో ప్రతిభను చూపిన క్రీడాకారులకు నగర అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ నాగార్జునరెడ్డి బహుమతులు అందజేశారు. క్రీడలు మానసికోల్లాసానికి, మనోవికాసానికి ఉపయోగపడతాయని, ఆరోగ్యంగా జీవించడానికి వ్యాయామం తప్పనిసరిగా చేయాలని విద్యార్థులకు సూచించారు. ప్రతి కళాశాలలో క్రీడలను ప్రోత్సహించినప్పుడే విద్యార్థులు చదువుల ఒత్తిడిని ఎదుర్కొని... అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారన్నారు.

ఇవీ చదవండి...వానరానికి మనిషి సహాయం..

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.