ప్రయాణికుల రద్దీ కారణంగా జూన్, జులై నెలల్లో 9 రూట్లలో 97 ప్రత్యేక సర్వీసులను నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. మచిలీపట్నం- సికింద్రాబాద్- మచిలీపట్నం మధ్య జూన్ 7 నుంచి 28 వరకు ప్రతీ ఆదివారం ఒకటి చొప్పున మొత్తం 8 సర్వీసులు అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్- నర్సాపూర్ మధ్య జూలై 7,14,21,28 తేదీల్లో 4 సర్వీసులను రైల్వే అధికారులు ప్రకటించారు. తిరుగుప్రయాణంలో నర్సాపూర్ నుంచి హైదరాబాద్కు 8,15,22,29 తేదీల్లో ప్రత్యేక రైళ్లు బయలు దేరుతాయి. తిరుపతి నుంచి నాగర్సోల్కు జూలై 5,12,19,26 తేదీల్లో... నాగర్సోల్ నుంచి తిరుపతికి జూలై 6,13,20,27 తేదీల్లో ... మొత్తం 10 ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. నాందేడ్ నుంచి తిరుపతికి జూలై 2,9,16,23,30 తేదీల్లో... తిరుపతి నుంచి నాందేడ్ కు జూలై 3,10,17,24,31 తేదీల్లో 10 ప్రత్యేక రైళ్లు, కాచిగూడ నుంచి కాకినాడకు జూలై 5,12,19,26 తేదీల్లో.. కాకినాడ నుంచి కాచిగూడకు 6,13,20,27 తేదీల్లో మొత్తం 8 ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయి. కాకినాడ నుంచి కర్నూలు సిటీకి జూలై 2,4,9,11,16,18,23,25,30 తేదీల్లో.. కర్నూలు సిటీ నుంచి కాకినాడకు జూలై 3,5,10,12,17,19,24,26,31 వరకు 18 సర్వీసులు రాకపోకలు సాగిస్తాయి. కాకినాడ- రాయచూరు మధ్య మరో 26 ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి... తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ