ETV Bharat / city

Story On Haridasulu: శ్రీమహావిష్ణువుకు ప్రతిరూపాలుగా భావించే హరిదాసులు.. ధనుర్మాస అతిథులు!

Haridasu keerthanalu: వాళ్లు ధనుర్మాస అతిథులు.! తెల్లవారుతూనే తెలుగులోగిళ్లను మేల్కొల్పుతారు. తంబుర మీటుతూ, చిడతలు వాయిస్తూ రామనామ సంకీర్తనలతో వీనుల విందుచేస్తారు. వాళ్లే శ్రీమహావిష్ణువుకు ప్రతిరూపాలుగా పెద్దలు చెప్పే హరిదాసులు! సంక్రాంతి పండుగను నెల ముందే గుర్తుచేస్తూ.. సంప్రదాయాలను ముందుతరాలకు అందిస్తున్నారు.

author img

By

Published : Jan 2, 2022, 5:32 AM IST

శ్రీమహావిష్ణువుకు ప్రతిరూపాలుగా భావించే హరిదాసులు.. ధనుర్మాస అతిథులు!

Story on Haridasulu: లేలేత సూర్యకిరణాలు భూమిని తాకే వేళ.. ఇంటి ముందు మహిళలు ముగ్గులు పెట్టేవేళ... కాలికి గజ్జెకట్టి.. తంబుర మీటుతూ చేతిలో చిడతలు వాయిస్తూ రామనామసంకీర్తన చేస్తుంటారు హరిదాసులు..! హరినామస్మరణ చేసేవారిని ఆశీర్వదించడానికి ఆశ్రీమహావిష్ణువే... వైకుంఠపురం నుంచి హరిదాసు రూపంలో వస్తారనేది ఒక నమ్మకం.!

పాపాలు తొలగిపోతాయని ప్రజల విశ్వాసం..!

సంక్రాంతికి ముందు అంటే ధనుర్మాసంలో హరిదాసులు వీధుల్లో వీనుల విందు చేస్తారు. శ్రీమద్రమారమణ గోవిందో హరీ అంటూ.. ఇంటి ముందు ముగ్గు చుట్టూ ఒకసారి తిరుగుతారు. గుమ్మంలో ఎవరూ లేకపోతే మరో ఇంటికి వెళ్తారేగానీ బిక్షాటనలా యాచించరు. అందులో బియ్యం పోస్తే తెలిసీతెలియక చేసిన పాపాలు తొలగిపోతాయని ప్రజల విశ్వాసం..!. ఉట్టి చేతులతో హరిదాసు వెళ్లిపోతే ఆఇంటికి అరిష్టమని ప్రజలూ భావిస్తుంటారు. అందుకే తంబుర గానం వినిపించగానే గృహిణులు ధాన్యంతో సిద్ధంగా ఉంటారు.

తెల్లవారక ముందే...

హరిదాసుల వస్త్రధారణ ప్రత్యేకంగా ఉంటుంది. పట్టు దోవతికట్టి.. పట్టు కండువా నడుముకు చుట్టి.. మెడలో ఒక పూల హారం ధరించి చక్కగా తిలకం దిద్దుకుంటారు. సూర్యభగవానుడు ప్రసాదించిన అక్షయపాత్రగా శిరస్సుపై పంచలోహపాత్రను ధరిస్తారు. తెల్లవారక ముందే ఈ అలంకరణంతా పూర్తి చేసుకుంటారు. గోదాదేవిని స్మరించి, తిరుప్పావై పఠించి వీధుల్లోకి వెళ్తారు. తిరిగి ఇంటికెళ్లేవరకూ హరినామ సంకీర్తన తప్ప ఇతర విషయాలేవీ మాట్లాడరు. తలపైన అక్షయపాత్రను కిందకు దించరు. ఇల్లు చేరాక ఆ ఇల్లాలు ఆ హరిదాసు పాదాలు కడిగి అక్షయపాత్రను దించుతుంది. అలా ధనుర్మాసమంతా ఎంతో నిష్టగా ఉంటారు హరిదాసులు.

ధనుర్మాసనంలో హరిదాసుల రామగానం

ఏడాదంతా వేర్వేరు పనుల్లో నిమగ్నమయ్యే హరిదాసులు.. ధనుర్మాసనంలో మాత్రం తప్పకుండా రామగానం చేస్తారు. సొంతూళ్ల నుంచి వేరే ఊళ్లకు వెళ్తారు. గ్రామవీధుల్లో బృందంగా భజనలు చేస్తారు. ప్రతీ ఇంటి ముందు కూర్చుని లేవడం కష్టమైనా.. భక్తిభావంలో అదంతా మరిచిపోతుంటారు. వంశపారపర్యంగా అనేక మంది దశాబ్దాలుగా రామనామస్మరణ చేస్తారు. ధనుర్మాసం, సంక్రాంతి పండుగ ముగిసిన తర్వాత తమ సొంతూళ్లకు వెళ్లే హరిదాసులు.. మిగతా రోజుల్లో పొలంపనులు, కూలి పనులతో జీవనం సాగిస్తారు

ఇదీ చదవండి..

SP Kowshal New year Celebrations : పోలీసు కుటుంబాల నడుమ.. ఎస్పీ కొత్త సంవత్సర వేడుకలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.