సైబర్ మోసాలపై బాధితులు ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఘటన జరిగిన వెంటనే బాధితులు పోలీసులను ఆశ్రయించడానికి పోలీసు శాఖ వీలు కల్పించింది. వాట్సప్ నంబరు, సైబర్ సెల్, జీమెయిల్లకు నేరుగా ఫిర్యాదు చేయాలని సూచించింది. బాధితులు సైబర్‌మిత్ర హెల్ప్‌లైన్‌కూ ఫిర్యాదు చేయవచ్చని తెలిపింది.
కేంద్ర హోంశాఖ హెల్ప్‌లైన్ 155260కి ఫిర్యాదు చేసిన వెంటనే చర్యలు తీసుకోనున్నట్లు సైబర్ క్రైం విభాగం అధికారులు తెలిపారు. వెంటనే ఫిర్యాదు చేయడం ద్వారా డిజిటల్ ఎకో సిస్టం నుంచి వెళ్లకముందే నగదును వెనక్కి తెచ్చేలా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి:
JAGAN-KISHAN REDDY MEET: ముఖ్యమంత్రి జగన్‌తో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి భేటీ