ETV Bharat / city

అఫ్గానిస్థాన్‌లో ఆంధ్రుల కోసం.. విజ‌య‌వాడ‌లో ప్రత్యేక హెల్ప్ డెస్క్! - vijayawada latest news

అఫ్గానిస్థాన్‌లో ప‌రిస్థితి దృష్ట్యా విజ‌య‌వాడ‌లో ప్రత్యేక హెల్ప్ డెస్క్

author img

By

Published : Aug 21, 2021, 4:00 PM IST

Updated : Aug 21, 2021, 5:16 PM IST

15:57 August 21

VJA_Afghan Spl Desk in VJA_Breaking

అఫ్గానిస్థాన్​లో ఏర్పడిన ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా అక్కడ చిక్కుకున్న ఏపీ కార్మికుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కాల్ సెంటర్ ను ఏర్పాటు చేసింది. టోల్ ఫ్రీ నెంబర్లను ప్రకటించింది. ఏపీ కార్మికులను సురక్షితంగా స్వస్థలాలకు తీసుకువచ్చేందుకు కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఈ టోల్ ఫ్రీ నెంబరు ఏర్పాటు చేసినట్టుగా ఆ శాఖ కమిషనర్ రేఖారాణి వెల్లడించారు. అఫ్గానిస్థాన్ లో ఉన్న కార్మికులు, వారికి సంబంధించిన వివరాలను 0866-2436314 కు లేదా 917780339884 నెంబర్లకు ఫోన్ చేసి చెప్పాలని సూచించారు.

వీటికి అదనంగా.. మరో రెండు నెంబర్లను కూడా అందుబాటులో ఉంచుతున్నట్టు ప్రకటించింది. +919492555089, 8977925653 నెంబర్లకు కూడా అఫ్గాన్ కార్మికులకు సంబంధించిన వివరాలను తెలియచేయవచ్చని తెలియచేసింది. అఫ్గాన్ లో చిక్కుకున్నవారిని కేంద్ర ప్రభుత్వ సహకారంతో వెనక్కు తీసుకువచ్చే ప్రయత్నంలో భాగంగా ఈ టోల్ ఫ్రీ నెంబర్లను ప్రకటించినట్టు కార్మిక శాఖ వెల్లడించింది.

ఇదీ చదవండి:

తాలిబన్లలకు మద్దతుగా పోస్టులు.. 14 మంది అరెస్ట్

Last Updated : Aug 21, 2021, 5:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.