ETV Bharat / city

GECO Tracking System: వేగంగా కేసుల విచారణకు 'గెకో' - గెకో సిస్టం

కేసులను వేగంగా విచారణ చేసేందుకు కృష్ణాజిల్లా పోలీసులు సరికొత్త ప్రణాళికను సిద్ధం చేశారు. "గెకో " పేరుతో నూతన ట్రాకింగ్ సిస్టంను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ సిద్ధార్ద్ కౌశల్ తెలిపారు.

SP Siddharth Kaushal unveiling the dashboard model
డాష్ బోర్డు నమూనాను ఆవిష్కరించిన ఎస్పీ సిద్ధార్ద్ కౌశల్
author img

By

Published : Oct 14, 2021, 3:33 PM IST

కేసులను వేగంగా విచారణ చేసేందుకు కృష్ణాజిల్లా పోలీసులు సరికొత్త ప్రణాళికను సిద్ధం చేశారు. "గెకో " పేరుతో నూతన ట్రాకింగ్ సిస్టమ్​ను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ సిద్ధార్ద్ కౌశల్ తెలిపారు. ఈ గ్రేవ్ ఎకనామిక్ అండ్ సైబర్ అఫెన్స్ (గెకో) ట్రాకింగ్ సిస్టంతో త్వరగా కేసుల్లో ఛార్జ్​షీట్ వేసే అవకాశముంటుందన్నారు సిద్ధార్ద్. దీనిద్వారా ట్రాకింగ్ చేయటంతో జిల్లాలో ఉన్న పెండింగ్ కేసులను త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. రాష్ట్రంలోనే తొలిసారిగా ఈ విధానాన్ని జిల్లాలో ప్రారంభిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.

సైబర్ కేసులపై ప్రత్యేక నిఘా పెడతామన్నారు. మచిలీపట్నం సైబర్ క్రైం పోలీసులకు నూతన సాఫ్ట్​వేర్​లు, కేసుల ఛేదనపై ప్రత్యేక శిక్షణనిచ్చామని వివరించారు. సైబర్ ల్యాబ్​ను పటిష్టపరిచినట్లు వెల్లడించారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు ఎస్పీ తెలిపారు.

ఇదీ చదవండి :

DRUGS: విశాఖ కేంద్రంగా.. ద్రవరూపంలో గంజాయి తయారుచేస్తున్న ముఠాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.