విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలో నూతనంగా నిర్మించిన ఆస్పత్రి ఓపీడీ బ్లాక్‌ను.. దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా ప్రారంభించారు. రూ. 5 కోట్ల వ్యయంతో నిర్మించిన ఓపీడీ బ్లాక్‌లో సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం రైల్వే స్టేషన్ పరిసరాలను తనిఖీ చేశారు. రూ. 9 కోట్ల ఖర్చుతో 1-10 ప్లాట్‌ఫాంలను కలుపుతూ విజయవాడ రైల్వేస్టేషన్లో నిర్మించిన మెగా ఫుట్ ఓవర్ బ్రిడ్జిని జీఎం పరిశీలించారు. మొదటి ప్లాట్ ఫాం సెల్లార్లో ఆధునీకరించిన రిజర్వేషన్ కౌంటర్లను తనిఖీ చేశారు. రాయనపాడులోని రైల్వే వ్యాగన్ వర్క్ షాప్‌ను సందర్శించారు. కొండపల్లి-డోర్నకల్ సెక్షన్ మధ్య మూడో లైన్ పనుల పురోగతిపై ఆరా తీశారు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇదీ చదవండి: