యాక్సిల్ బాక్స్ బేరింగ్‌లు, వీల్ స్లైడ్ ప్రొటెక్షన్ డివైస్ లో డేటా అనలిటిక్స్ ద్వారా డేటా పాయింట్లను ఆన్‌లైన్‌లో నిరంతరంగా ప్రోటోటైప్ సాఫ్ట్‌వేర్ పరిశీలిస్తుందని అధికారులు తెలిపారు. దీని ద్వారా రైలు ప్రయాణం సురక్షితంగా సాగడమే కాకుండా మార్గమధ్యంలో కోచ్‌లు విడిపోవడాన్ని నివారిస్తుందని తెలిపారు. ఎల్‌హెచ్‌బీ బోగీలో డబ్ల్యుఎస్‌పీడీ, యాక్సిల్ బాక్స్ ఉష్ణోగ్రతను మొబైల్ అప్లికేషన్ వ్యవస్థ నిరంతరం పరిశీలిస్తూ.. లోపాలు ఉన్నట్లయితే సరైన సమయంలో గుర్తించి హెచ్చరికు జారీ చేస్తుందని అధికారులు తెలిపారు.
రైళ్లలో వేగాన్ని తగ్గించేందుకు బ్రేకు వేసిన సమయంలో పట్టాపై పట్టును కలిగి ఉండేందుకుగాను ఎల్‌హెచ్‌బీ బోగీకి వీల్ స్లైడ్ ప్రొటెక్షన్ పరికరాలను అమర్చుతారు. ఈ వ్యవస్థలో స్ప్రింగ్ విరిగిపోవడం, గ్రీస్ కారిపోవడం, డ్యాంపర్ లీకేజీ వంటి ఇతరత్రా సమస్య తలెత్తినపుడు అప్రమత్తం చేస్తుంది. తద్వారా వీల్ షెల్లింగ్‌ను నివారించే దిశగా సరైన సమయంలో సరైన చర్య చేపట్టేందుకు అవకాశముంటుంది. ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడంలో ఈ సాంకేతికత ఉపయోగపడుతుంది. అతి తక్కువ వ్యయంతో ఈ మొబైల్ అప్లికేషన్‌ను అభివృద్ధి చేసినందుకు తిరుపతి కోచింగ్ డిపో అధికారులు, సిబ్బందిని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాళ్యా ప్రశంసించారు.
ఇదీ చదవండి: నంద్యాల ఘటనపై సీఎం జగన్ సీరియస్