SOMU VEERRAJU LETTER TO CM JAGAN: ఆత్మకూరు ఆంధ్రప్రదేశ్‌లో ఉందా లేక పాకిస్థాన్‌లో భాగమని ముఖ్యమంత్రి భావిస్తున్నారా అని... భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రశ్నించారు. కర్నూలు జిల్లా ఆత్మకూరులో ఘటన జరిగి 24 గంటలు గడిచినా సీఎం ఎందుకు ప్రకటన చేయడం లేదని నిలదీశారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి జగన్‌కు బహిరంగ లేఖ రాశారు.
ఒక వర్గం వారిపై పథకం ప్రకారం దాడి జరిగినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలన్నారు. ఇలాంటి సమయంలో ముఖ్యమంత్రి మౌనంగా ఉంటే.. ఘటనపై ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్యే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. భాజపా జిల్లా అధ్యక్షుడు బుడ్డా శ్రీకాంత్‌రెడ్డితోపాటు.. పోలీసులపై దాడి చేయడం, పోలీసు స్టేషన్ ధ్వంసం చేయడం దారుణమన్నారు. జరిగిన ఘటనపై ఆలస్యంగా స్పందించిన డీజీపీ... గాయపడిన పోలీసులకు కనీస ధైర్యం చెప్పలేదని విమర్శించారు.
ఇదీ చదవండి: SUSPEND: శ్రీశైలం దేవస్థానం పర్యవేక్షకుడు పి.ఉమేశ్ సస్పెన్షన్