ETV Bharat / city

ద్వారంపూడి భాషను సభ్యసమాజం హర్షించదు: సోము వీర్రాజు - ద్వారంపూడి వ్యాఖ్యలు

భాజపాపై మైనార్టీలను రెచ్చగొట్టే విధంగా కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి వ్యాఖ్యలు చేశారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. ఆయన వాడిన భాష.. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వ్యక్తి వాడేది కాదని.., ఈ విషయంలో భాజపా ఎంతవరకైనా వెళుతుందన్నారు.

ద్వారంపూడి బాషను సభ్యసమాజం హర్షించదు
ద్వారంపూడి బాషను సభ్యసమాజం హర్షించదు
author img

By

Published : May 4, 2022, 7:24 PM IST

మత విద్వేషాలు రెచ్చగొట్టేలా కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. భాజపాపై మైనార్టీలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. భయబ్రాంతులకు గురిచేసే విధంగా ద్వారంపూడి వినియోగించిన భాషను సభ్యసమాజం హర్షించదని అన్నారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వ్యక్తి వాడే పదజాలం కాదని.., ఈ విషయంలో భాజపా ఎంతవరకైనా వెళుతుందని అన్నారు. జేఎన్టీయూ ఆస్తిని కాపాడడానికి తాము సిద్దంగా ఉన్నామని సోము స్పష్టం చేశారు.

ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి: ఎమ్మెల్యే ద్వారంపూడి క్షమాపణలు చెప్పి, తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్ర శివన్నారాయణ డిమాండ్ చేశారు. కాకినాడ జేఎన్​టీయూ స్థలం కబ్జా కాకూడదనేది తమ అభిప్రాయమని.. ఎమ్మెల్యే ద్వారంపూడి మాత్రం మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వ స్థలాలు కబ్జా చేస్తే భాజపా చూస్తూ ఊరుకోబోదని హెచ్చరించారు. ఎమ్మెల్యే అక్రమ దందాపై కేంద్రానికి ఫిర్యాదు చేశామని.., ప్రభుత్వ ఆస్తులను దోచుకుంటున్న ద్వారంపూడిపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి: MLA Dwarampudi: 'జనసేన పార్టీని తాకట్టు పెట్టే పనిలో ఉన్నారు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.