తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిలను అరెస్టు చేయటాన్ని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఖండించారు. ప్రభాకర్ రెడ్డిని అరెస్ట్ చేయడమే దుర్మార్గమైతే..అభం శుభం తెలియని అస్మిత్ రెడ్డిని అదుపులోకి తీసుకోవటం ఇంకా అన్యాయమన్నారు. చంద్రబాబు, వైఎస్సార్ హయాంలలో రాజకీయ పోరాటాలు మాత్రమే ఉండేవన్న సోమిరెడ్డి.. వ్యక్తులు, వ్యాపారాలను లక్ష్యం చేసుకోలేదని గుర్తు చేశారు. తమిళనాడు తరహా కక్ష సాధింపు రాజకీయాలను ఏపీలోకి తీసుకురావడం దురదృష్టకరమని సోమిరెడ్డి దుయ్యబట్టారు.
ప్రభాకర్ రెడ్డి అరెస్టు దుర్మార్గమైన చర్య: సోమిరెడ్డి - జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్టు న్యూస్
జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడిని అన్యాయంగా అరెస్టు చేశారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. తమిళనాడు తరహా కక్ష సాధింపు రాజకీయాలను ఏపీలోకి తీసుకురావడం దురదృష్టకరమని సోమిరెడ్డి దుయ్యబట్టారు.