వైద్య ఖర్చుకు భరించలేక మధ్య తరగతి కుటుంబాలన్నీ పేద కుటుంబాలుగా మారిపోయాయని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థికంగా చితికిపోయామనే బాధతోనే చాలామంది చనిపోతున్నారన్నారు. 'కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ప్రజల ప్రాణాలు పోతుండటం క్షమించరాని నేరం. కరోనా తీవ్రతను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంత దారుణంగా గాలికి వదిలేస్తారనుకోలేదు. మొదటి దశతో పోల్చితే రెండో దశ పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
కేబినెట్ ర్యాంక్ కలిగిన సలహాదార్లు ప్రభుత్వానికి 40మంది ఉన్నా, వారిలో ఒక్కరు కూడా వైద్యనిపుణులు లేకపోవటం దురదృష్టకరం. ఆటోరిక్షాలు, అంబులెన్స్‌ల్లో కరోనా రోగులు ప్రాణాలు కోల్పోవటం హృదయవిదారకం. తక్షణమే రాష్ట్రంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితి ప్రకటించి తగినన్ని నిధులు మంజూరు చేయాలి. నిపుణుల బృందాన్ని నియమించి ప్రత్యేక శ్రద్ధతో ప్రజల ప్రాణాలు కాపాడాలి' అని సోమిరెడ్డి డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: విజయనగరం ప్రభుత్వాసుపత్రిలో విషాదం.. ఇద్దరు కొవిడ్ రోగులు మృతి