ఇప్పటికే కార్యనిర్వాహక వ్యవస్థను నిర్వీర్యం చేసి... శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థల్లో ఎవరూ పరిధులు దాటకూడదంటూ సభాపతి తమ్మినేని అనడం విడ్దూరంగా ఉందని తెదేపా నేత సోమిరెడ్డి విమర్శించారు. వైకాపా ప్రభుత్వ నియంతృత్వ నిర్ణయాలు, కక్ష సాధింపు చర్యలతో రాష్ట్రాభివృద్దితోపాటు ప్రజల భవిత ప్రమాదంలో పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ పరిస్థితుల్లో స్పీకర్ సీతారాం న్యాయ వ్యవస్థనూ బెదిరించేలా మాట్లాడడం చూస్తుంటే ఆశ్చర్యకరంగా ఉందన్నారు. రాష్ట్రంలో పాలన ప్రజాస్వామ్య విధానానికి అతీతంగా ఉందని వారు అనుకుంటున్నారేమోనని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి...
రాజ్యాంగం ప్రకారం ఎవరి పరిధిలో వాళ్లుండాలి: సభాపతి తమ్మినేని