ETV Bharat / city

అరవై ఏళ్ల వయసులో.. "సిక్స్ ప్యాక్" కొట్టేశాడు..! - విజయవాడ తాజా వార్తలు

six pack: ఆయన వయసు 62 సంవత్సరాలు. కృష్ణా.. రామా.. అని జపం చేసే వయసు. కానీ.. ఆయన మాత్రం ఫిట్నెస్, సిక్స్ ప్యాక్ అంటూ జపించారు.. తపించారు.. చివరకు సాధించారు. వయసు సహకరిస్తుందా? అని డౌట్ వచ్చినా.. డోంట్ కేర్ అన్నారు. పట్టుదల ఉంటే.. సాధించలేనిది ఏదీ లేదని రెగ్యులర్ డైలాగ్​కు.. మోడ్రన్ టచ్ ఇచ్చారు. యూత్​కు ఏమాత్రం తీసిపోకుండా కసరత్తులు చేసి.. అనుకున్న టార్గెట్​ రీచ్ అయ్యారు. ఇంతకీ ఆ గోల్డెన్ సిక్స్ ప్యాక్ ఎవరిదో చూడాలంటే.. విజయవాడ దాకా వెళ్లి రావాల్సిందే!

Sixty year old man got six pack
సిక్టీ ఇయర్స్ ఏజ్​​లో సిక్స్​ ప్యాక్
author img

By

Published : Apr 18, 2022, 3:10 PM IST

six pack: ఆయన పేరు రామకృష్ణ. ఊరు విజయవాడ. ఆరోగ్యం కోసం వ్యాయామాలు చేసే ఆ వ్యక్తికి.. ఉన్నట్టుండి సిక్స్‌ప్యాక్‌ సాధించాలనే కోరిక కలిగింది. మెుదటి నుంచి ఆరోగ్యంపై శ్రద్ధ ఉన్న రామకృష్ణ.. ప్రతిరోజూ వాకింగ్ చేసేవారు. మధ్యలో కొవిడ్‌ బారిన పడటంతో.. వాకింగ్ కు వెళ్లటం మానేశారు. ఈ క్రమంలోనే కెనడా నుంచి వచ్చిన కుమారుడు.. ఇంట్లోనే జిమ్‌ ఏర్పాటు చేసుకోవడంతో ఇద్దరూ కలిసి సాధన చేయడం ప్రారంభించారు. కుమారుడు తిరిగి విదేశాలకు వెళ్లినా.. ఆయన మాత్రం మాత్రం సాధన ఆపలేదు. ఆ సమయంలోనే 57 ఏళ్ల వ్యక్తి సిక్స్‌ప్యాక్‌ సాధించారన్న వార్తను చూసిన రామకృష్ణ.. తాను కూడా ఆ విధంగా శరీరాన్ని మలుచుకోవాలని నిర్ణయించుకున్నారు. కుమారుడి సలహాలతో.. వివిధ రకాల వ్యాయామాలు చేయడం ప్రారంభించారు. మంచి ఆహార నియమాలు పాటిస్తూ.. ఫైనల్ గా సిక్స్‌ ప్యాక్ బాడీ సాధించారు.

సిక్టీ ఇయర్స్ ఏజ్​​లో సిక్స్​ ప్యాక్

six pack: మంచి ఆహారం, రోజూవారీ వ్యాయామాలు ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతాయని రామకృష్ణ తెలిపారు. తన వద్దకి వచ్చిన పిల్లలతోపాటు స్నేహితులకు వ్యాయామాల్లో మెళకువలు నేర్పిస్తున్నానన్నారు. యువత, మెుబైల్ వాడకానికి కేటాయించే సమయంలో.. గంటపాటు వ్యాయామాలు చేస్తే.. సిక్స్ ప్యాక్ సాధించవచ్చని చెబుతున్నారు.

" మామూలుగా వర్కౌట్లు చేసేవాణ్ని. సిక్స్​ప్యాక్​ అనేది అసలు ఐడియా లేదు. చేస్తే ఎలా ఉంటుందని మా బాబును అడిగాను. ఎక్కువగా చేయకూడదు.. కొద్దిగా చేస్తూ పోవాలని మా అబ్బాయి చెప్పాడు. చెప్పమంటే కొన్ని టిప్స్ చెప్పాడు. డైట్, ఎక్సైజ్​లు చెప్పాడు. అవి ఫాలో అవుతూ... చేశాను. రోజూ గంటన్నర సమయం చేస్తాను. మామూలు ఎక్సైజ్​లు చేసి, మళ్లీ యాప్​ వర్కౌట్​ చేయాలి. మామూలు ఎక్సైజ్​లు వేరు.. సిక్స్‌ ప్యాక్ ఎక్సైజ్​ వేరు. దీనికి డైట్ కచ్చితంగా పాటించాలి. దీని వల్ల చాలా హెల్దీగా ఉంటాం. బీపీలు, షుగర్లు ఇవన్నీ ఏమీ రావు. ఇది అందరికీ మంచిది." - రామకృష్ణ, విజయవాడ

ఆహార నియమాలు పాటించే విషయంలో... భార్య రాజ్యలక్ష్మి సహకారం మరువలేనిదని రామకృష్ణ తెలిపారు. తనకు కావాల్సినవన్నీ వండిపెడుతుంటారని వివరించారు. తన వద్దకు వచ్చే యువకులకు సైతం ఆరోగ్య విషయాలపై తన భర్త ఎంతో విలువైన సూచనలు చేస్తుంటారని భార్య రాజ్యలక్ష్మి తెలిపారు.

" ఏదైనా ఆయిల్​ ఫుడ్​, రైసు లేకుండా ఎక్కువ పెరుగు, కూరగాయ ముక్కలు, కర్రీలు, చెపాతీలు లాంటివి ఇస్తాము. మళ్లీ ఈవినింగ్​ కూడా జ్యూసులు, గ్రీన్ టీలు, ఇంట్రెస్టును బట్టి టెంకు ఇవ్వాల్సినవి ఇచ్చాం. ఇప్పుడు చాలా బాగుంది. ఇంతకు ముందు బీపీ అనేవారు. ఇప్పుడు లేవు. ఆయనకే కాదు మాకు కూడా చేయాలని చెబుతారు. ఫ్రెండ్స్​కు కూడా ఎలా చేయాలని చెబుతారు. " - రాజ్యలక్ష్మి, రామకృష్ణ భార్య

ఇదీ చదవండి: మూడేళ్లలో ముందుకు సాగని సాగునీటి ప్రాజెక్టులు... ఎప్పటికప్పుడు గడువు పెంపు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.