రైస్ పుల్లింగ్ (Rice Pulling) అంటే ఏంటో తెలియని వారికి మాయ మాటలు చెప్పి బురిడి కొట్టిస్తున్నారు. డబ్బుపై ఆశపడుతున్న వారిని టార్గెట్ చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. రాగి చెంబు, బియ్యం. ఇవి ఉంటే చాలని.. ప్రజలను నమ్మించి లక్షలు దండుకుంటున్నారు కేటుగాళ్లు. తాజాగా అమాయక ప్రజలను మోసం చేస్తున్న రైస్ పుల్లింగ్ ముఠాకు చెక్ పెట్టారు.. కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు సీసీబీ పోలీసులు.
చేతిలో ఓ ఇత్తడి చెంబు.. ఆ చెంబులో ఓ అయస్కాంతం. ఇనుప రేణువులతో కలిసిన కాసిన్ని బియ్యం గింజలు. చెంబులో మహిమలున్నాయంటూ జనాలను నమ్మిస్తున్నారు. ఈ చెంబును విక్రయిస్తే వారికి అదృష్టం వరించి.. రాత్రికి రాత్రే కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని నమ్మబలికి.. వారి వద్ద నుంచి భారీ మొత్తంలో నగదు వసూలు చేస్తున్నారు.
ముఠా సభ్యుల అరెస్టు
అమాయకపు ప్రజలను మోసం చేసి.. వారి జేబులను గుళ్ల చేస్తున్న ఆరుగురు రైస్ పుల్లింగ్ ముఠా సభ్యులను.. బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. పట్టణంలో గల వ్యాలీకావల్లోని ఓ హోటల్ వేదికగా.. రెండు నెలల నుంచి రైస్ పుల్లింగ్ పేరుతో ప్రజల వద్ద నుంచి లక్షల రూపాయలను దండుకుంటున్నారన్న సమాచారంతో.. సీసీబీ అధికారి జగన్నాథ్ రాయ్ ఆధ్వర్యంలో తనీఖీలు చేపట్టారు. రైస్ పుల్లింగ్కు పాల్పడుతున్న షేక్ అహ్మద్, అతని భార్య జరీనా అహ్మద్.. రాష్ట్రానికి చెందిన వారు కాగా.. రాఘవేంద్ర ప్రసాద్, నైముల్లా, ముదాసిర్ అహ్మద్, ఫరీదా.. బెంగళూరుకు చెందిన వారని పోలీసులు తెలిపారు.
అసలు రైస్ పుల్లింగ్ మెషిన్ అంటే ఏంటి?
రైస్ పుల్లింగ్ మెషిన్.. రేడియేషన్ లక్షణాలతో బియ్యాన్ని తన వైపుకు ఆకర్షించే లక్షణాలుండే లోహం..(ఇది దాదాపు అర అడుగుల దూరం నుండి బియ్యం గింజలను ఆకర్షించగలదు). దీంతో ఈ లోహాలు గ్లోబల్ మార్కెట్లో అధిక ధరలు పలుకుతున్నాయి. బియ్యాన్ని లాగే లక్షణాలు.. సాధారణంగా రాగి, ఇరిడియంతో తయారైన వస్తువులైన నాణేలు, పాత్రలు, టంబ్లర్లు, ఆభరణాలు మొదలైన రూపాల్లో మార్కెట్లో లభిస్తాయి. ఈ రకమైన లోహాలు సహజ విద్యుత్ శక్తి.. లేదా అయస్కాంత శక్తిని కలిగి ఉంటాయి. రైస్ పుల్లర్లకు శక్తులు ఉన్నాయని.. ఇంటికి సంపద, శ్రేయస్సును పెంచుతుందని నమ్ముతారు.
రైస్ పుల్లింగ్ మెషిన్ ఉపయోగాలు
రైస్ పుల్లింగ్ మెషిన్ సహజ విద్యుత్ లేదా అయస్కాంత శక్తిని ప్రదర్శించటంతో.. ఉపగ్రహాలు, రాకెట్లు, ఆర్మీ రీసెర్చ్ పనుల్లో, సైన్యం పరిశోధన ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు.
ఇదీ చదవండి: