తాడేపల్లి గోశాలలో ఆవుల మృతి ఘటనను.. పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ఈ కేసులో విచారణకు సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్)ను ఉన్నతాధికారులు ఏర్పాటు చేశారు. ఏసీపీ స్థాయి అధికారి నేతృత్వంలో ఈ బృందం పని చేయనుంది. ఆరుగురు సభ్యులతో కూడిన బృందాన్ని సీపీ ద్వారకా తిరుమలరావు నియమించారు. సీసీఎస్ ఏసీపీ శ్రీనివాసరావు నేతృత్వంలో ఇద్దరు ఇన్స్పెక్టర్లు, ముగ్గురు ఎస్సైలు సిట్‌లో పని చేయనున్నారు.
ఇదీ చదవండి: