పవన, సౌర విద్యుత్ కంపెనీల నుంచి విద్యుత్ కొనుగోలును ప్రభుత్వం నిలిపియాడాన్ని సవాల్ చేస్తూ విద్యుత్ కంపెనీలు హైకోర్టును ఆశ్రయించాయి. పీపీఏలకు సంబంధించిన పిటిషన్‌ను కోర్టు విచారణకు స్వీకరించింది. ఇప్పటివరకు బ్యాక్ డౌన్ విధానంలో విద్యుత్‌ను ప్రభుత్వం కొనుగోలు చేసినట్లు కంపెనీ తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం విచారణను రెండురోజులకు వాయిదా వేసింది.
ఇదీ చదవండి... 65 గ్రామాలకు... 920 వాలంటీర్లు ఎంపిక