సాధారణంగా అనారోగ్యం వస్తే వెంటనే ఆసుపత్రికి వెళతాం. ప్రస్తుతం రాష్ట్రమంతా లాక్ డౌన్ విధించటంతో సాధారణ రోగులు వైద్య సాయం అందక పలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో అన్ని ఆసుపత్రులు టెలీమెడిసిన్ వైపు అడుగులు వేశాయి. దూరం నుంచే రోగులకు వైద్య సాయం చేస్తున్నాయి.
గర్భిణీలకు ఎంతో ఉపయోగం...
ప్రస్తుతం ఒక్కో ఆసుపత్రిలో కొద్దిమంది వైద్యులు మాత్రమే అందుబాటులో ఉంటున్నారు. అన్ని ఆసుపత్రుల్లో సాధారణ ఓపీలను నిలిపివేశారు. దీంతో వైద్యులు వీడియో కాల్స్ ద్వారా రోగులను చూసి వారి ఆరోగ్య సమస్యలను తెలుసుకుని సూచనలు చేస్తూ..మందులను చెబుతున్నారు. ముఖ్యంగా చిన్నారులు, గర్భిణీలు ఎప్పటికప్పుడు వైద్యుల సూచనలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో టెలీమెడిసిన్ ఎంతో ఉపయోగపడుతుందంటున్నారు .
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టాలంటే మరికొంత కాలం భౌతికదూరాన్ని పాటించాలని వైద్యులు చెపుతున్నారు. ఈ తరుణంలో సాధారణ జబ్బులకు, అనారోగ్య సమస్యలకు టెలీమెడిసిన్ ద్వారా వైద్యం అందించడమే మంచిదని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.
ఇవీ చదవండి...బయటకి వచ్చారో ఆ రాక్షసుడి చేతిలో చచ్చారే!