రాష్ట్రంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మూడు రోజుల పర్యటన ముగిసింది. విజయవాడ విమానాశ్రయంలో ఉపరాష్ట్రపతికి పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు. గవర్నర్ బిశ్వభూషణ్ పుష్పగుచ్చం ఆందజేశారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మెమెంటోను అందజేసి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో డీజీపీ గౌతం సవాంగ్, కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో మూడు రోజుల పర్యటన పూర్తి చేసుకుని ఉప రాష్ట్రపతి బెంగళూరు బయలుదేరారు.
ఇదీ చదవండి: రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది: సీఎం జగన్