రాజ్‌భవన్‌లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిలిపివేతకు కారణాలను ఆయన గవర్నర్‌కు వివరించారు. ఏ పరిస్థితుల్లో నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో కూలకుషంగా తెలిపారు. స్థానిక ఎన్నికల వాయిదాపై ముఖ్యమంత్రి జగన్ గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో....బిశ్వభూషణ్ ఎస్ఈసీని పిలిచి విషయం కనుక్కున్నారు. సీఎం లేవనెత్తిన అభ్యంతరాలపై రమేశ్‌కుమార్‌తో గవర్నర్ చర్చించారు. సుమారు 45 నిమిషాల పాటు చర్చ సాగింది. గవర్నర్‌తోపాటు రాష్ట్రంలో శాంతిభద్రతల పర్యవేక్షణ సమన్వయ అధికారిగా ఉన్న ఐజీ సత్యనారాయణను సైతం ఎస్ఈసీ కలిశారు.
ఇవీ చదవండి: