ETV Bharat / city

పంచాయతీల నిధుల మళ్లింపుపై.. భగ్గుమంటున్న సర్పంచులు - grama panchayats funds news in ap

Protest Against Diversion of grama panchayats funds: వికేంద్రీకరణ.. ఇదే మా ప్రభుత్వ మాట..బాట. 3 రాజధానుల ప్రకటనప్పుడు, కొత్త జిల్లాల ఏర్పాటప్పుడూ ఇలా ప్రతీ సందర్భంలోనూ ఇదే ప్రస్తావన. మరి ఇంతలా చెబుతున్న సర్కార్‌.. వికేంద్రీకరణకు ఆయువు పట్టైన పంచాయతీలను మాత్రం గాలికొదిలేసింది. ప్రభుత్వం తరఫున ఇవ్వాల్సిన చేయూతను ఇవ్వకపోగా ఆర్థిక సంఘం నిధులు, కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లతో పాటు పన్నులతో వచ్చిన ఆదాయాన్ని లాగేసుకుంటోంది. ఫలితంగా పల్లె అవసరాలు తీర్చాల్సిన పంచాయతీలు చేతిలో పైసా నిధుల్లేక అల్లాడుతున్నాయి. పైగా సర్పంచ్‌ పదవులను నామమాత్రం చేస్తూ.. సచివాలయాలకే వైకాపా సర్కార్‌ పూర్తి పెత్తనం అప్పజెప్పింది.

Protest Against Diversion of grama panchayats funds
పంచాయతీల నిధుల మళ్లింపు
author img

By

Published : Apr 6, 2022, 4:19 AM IST

Updated : Apr 6, 2022, 6:41 AM IST

పంచాయతీల నిధుల మళ్లింపు

Diversion of grama panchayats funds: గ్రామ పంచాయతీలకు విధులు, నిధులతోనే పాలనా వికేంద్రీకరణ. అయితే.. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు విధులివ్వకపోగా, వివిధ రూపాల్లో సమకూరిన ఆదాయాన్ని మళ్లించుకుంటోంది. ఈ ఏడాది కేంద్రం ఇచ్చిన ఆర్థిక సంఘం నిధులు రూ. 12 వందల 45 కోట్ల లాగేసుకుంది. ఇంటి, నల్లా పన్నులు వంద శాతం వసూలు చేయాలంటూ సర్పంచులు, పంచాయతీ సిబ్బంది మెడపై కత్తిపెట్టి వసూలు చేయించిన సొమ్మును ఖాతాల్లోంచి ఖాళీ చేసింది. నియోజకవర్గ అభివృద్ధి నిధి పేరిట ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 2 కోట్లు ఇస్తామన్న ప్రభుత్వం.. పంచాయతీలకు మాత్రం పైసా ఇవ్వకపోవడం వికేంద్రీకరణ ఎలా అవుతుందని సర్పంచులు ప్రశ్నిస్తున్నారు.

అప్పుల కోసం ఎప్పటికప్పుడు వెంపర్లాడుతున్న సర్కారు.. ఎవరడుగుతారులే అన్న అధికార దర్పంతో సర్పంచులకు తెలియకుండానే పంచాయతీల ఖాతాల్ని ఖాళీ చేస్తోంది. ఎంత సొమ్ము తీసుకుందో సమాచారమివ్వని ప్రభుత్వం.. ఎప్పుడు తిరిగిస్తామో చెప్పకుండా చిన్నచూపుతో వ్యవహరిస్తోంది. ఎన్నికలు నిర్వహించి ఏడాదవుతున్నా గ్రామాల అభివృద్ధికి ఎలాంటి చేయూత ఇవ్వడం లేదని.. దీంతో చిన్న అభివృద్ధి పని కూడా చేయలేకపోతున్నామని సర్పంచులు వాపోతున్నారు. మితిమీరిన జోక్యంతో పంచాయతీలను ప్రభుత్వమే నిర్వీర్యం చేస్తోందని.. రోజు వారీ అవసరాలకు రూపాయి ఖర్చు చేసే అవకాశం లేక భిక్షాటన చేయాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయని వాపోతున్నారు.

ఏడాది కాలంలో పంచాయతీల నుంచి ప్రభుత్వం రూ. 2వేల కోట్లకు పైగా తీసుకుంది. ఇందులో 14, 15 ఆర్థిక సంఘం నిధుల కింద కేంద్రం ఇచ్చిన రూ. 1,245 కోట్లను విద్యుత్తు ఛార్జీల కింద రెండు విడతల్లో తీసుకుంది. దీంతో ఏడు నెలలుగా గ్రామాల్లో అభివృద్ధి నిలిచిపోయి ఎలాంటి పనులు చేపట్టే పరిస్థితి లేదు. 2021-22 సంవత్సరానికి రెండో విడత 15వ ఆర్థిక సంఘం నిధుల కోసం పంచాయతీలు ఎదురు చూస్తున్నాయి. దాదాపు 960 కోట్ల ఈ నిధులను కేంద్ర ప్రభుత్వం 2022 మార్చి నెలాఖరులోగా రాష్ట్రాలకు విడుదల చేయాలి. కేంద్రం నిధులు విడుదల చేసినా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా బయటపెట్ట లేదా? నిధుల విడుదలలో కేంద్రమే జాప్యం చేస్తుందా? అనేది తెలియాలి.

పంచాయతీల నుంచి రాష్ట్ర ప్రభుత్వం మళ్లించిన సాధారణ నిధులెంత అనే విషయంలోనూ అధికారులు నోరుమెదపడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 13,371 గ్రామ పంచాయతీలు ఉండగా.. ఒక్కో దానిలో సగటున 2 లక్షల నుంచి 20 లక్షల వరకు సాధారణ నిధులు ఉంటాయన్నది అంచనా. పెద్ద పంచాయతీల్లో అయితే కోట్లలో నిధులు ఉండనున్నాయి. ప్రత్యేకించి కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో పన్నులు, పన్నేతరాలు 70 శాతం వరకు వసూలవుతాయి. 2021-22 ఆర్థిక సంవత్సరం మార్చితో ముగుస్తుందన్న కారణంతో అధికారులు గత మూడు, నాలుగు నెలలుగా పన్నుల వసూళ్లపై ప్రత్యేకంగా దృష్టి పెట్టడంతో రాష్ట్ర వ్యాప్తంగా 65 శాతానికిపైగా వసూళ్లు జరిగాయి.

ఒక్కో పంచాయతీలో సగటున 5 లక్షలు చొప్పున సాధారణ నిధులు ఉన్నాయనుకున్నా.. 668 కోట్లకుపైగా నిధులు ఖాళీ చేసినట్లు అంచనా. అయితే 1,000 కోట్లకుపైగా నిధులు ఖాళీ చేశారని సర్పంచులు చెబుతున్నారు. నిరసనలు వ్యక్తం చేస్తూ రోడ్లుపైకి వస్తున్నా, బిక్షాటనలు చేస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. సాధారణ నిధుల ఖాతాలు ఖాళీ చేయడమనేది గతంలో ఎప్పుడూ చూడలేదని విశ్రాంత పంచాయతీ అధికారి ఒకరు చెప్పారు.
కృష్ణా జిల్లా ప్రసాదంపాడు పంచాయతీలో 15 లక్షల సాధారణ నిధులు మళ్లించడంతో ఖాతా ఖాళీ అయ్యింది. వేసవితో పెరిగిన తాగునీటి అవసరాల దృష్ట్యా సాధారణ నిధులతో కొత్తగా బోర్లు వేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయగా.. నిధులు మళ్లింపుతో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ఇదే పంచాయతీ నుంచి విద్యుత్తు ఛార్జీల బకాయిల కింద 75 లక్షల ఆర్థిక సంఘం నిధులు ప్రభుత్వం మళ్లించింది.కర్నూలు జిల్లా కోడుమూరు మేజర్‌ పంచాయతీలో దాదాపు 90 లక్షలు నిధులు మళ్లించారు. పన్నులతోపాటు షాపింగ్‌ కాంప్లెక్సు నుంచి వచ్చే అద్దెలు, ఇతర ఆదాయం సాధారణ నిధుల ఖాతాలో జమ చేశారు.

మార్చి 31 వరకు ఖాతాలో ఉన్న నిధులు ఏప్రిల్‌ 1న ఖాళీ అయ్యాయి.కడప జిల్లా మెరుగుడి పంచాయతీ నుంచి 8.40 లక్షల సాధారణ నిధులను ప్రభుత్వం మళ్లించడంతో సిబ్బందికి జీతాలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది.ప్రకాశం జిల్లా పర్చూరు, వీరన్నపాలెం పంచాయతీల్లో మొత్తం 22.98 లక్షల సాధారణ నిధుల మళ్లింపుతో ఖాతా ఖాళీ అయ్యింది. తూర్పుగోదావరి జిల్లా మల్కీపురం మండలం కేసనపల్లి పంచాయతీలో రహదారి నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసి పనులు ప్రారంభించే దశలో దాదాపు 3.50 లక్షల నిధులు లాగేసుకోవడంతో....చేసేదిలేక పనుల ప్రయత్నాన్ని తాత్కాలికంగా విరమించుకున్నారు.

సాధారణ నిధులను గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ, ఇతర అత్యవసర పనులతోపాటు పొరుగు సేవల సిబ్బంది వేతనాలకు పంచాయతీలు ఖర్చు చేస్తుంటాయి. వేసవి కారణంగా తాగునీటి సరఫరాపై పంచాయతీల బాధ్యత. మోటార్లు పాడైనా, పైపులైన్లు దెబ్బతిన్నా వీటి తక్షణ మరమ్మతులకు సాధారణ నిధులే పంచాయతీలకు ఆధారం. సాధారణ నిధుల్ని ప్రభుత్వం మళ్లించడంతో.. ఇప్పుడీ పనులు చేపట్టేందుకు కూడా చేతిలో పైసా లేదని సర్పంచులు గగ్గోలు పెడుతున్నారు.

అత్యవసర పనులపైనా రాబోయే రోజుల్లో తీవ్ర ప్రభావం పడుతుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు సర్పంచులు, కార్యదర్శులు సొంత నిధులు ఖర్చు చేస్తున్నారు. నాలుగైదు రోజులంటే సర్దుబాటు చేయగలమని, అంతకంటే మించితే తాము కూడా చేసేదేమీ లేదని కృష్ణా జిల్లాకి చెందిన అధికార పార్టీ సర్పంచి ఒకరు చెప్పారు. ఏడాది కాలంలో చెప్పుకోదగ్గ ఒక పని కూడా చేయలేకపోయామని కడప జిల్లాకి చెందిన మరో అధికార పార్టీ సర్పంచి ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ విధానాలు, చర్యలతో సర్పంచులు ఏడాదిగా ఉత్సవ విగ్రహాల్లా మిగిలిపోయారు. గ్రామ సచివాలయాల వ్యవస్థ రాష్ట్రంలో ప్రారంభమయ్యాక సర్పంచుల ప్రాధాన్యం పూర్తిగా తగ్గింది. గ్రామ పంచాయతీల పరిధిలో ఏర్పాటైన సచివాలయాలపైనా సర్పంచుల పర్యవేక్షణ, నియంత్రణ లేకుండా ప్రభుత్వం వీరి అధికారాలపై కత్తెర వేసింది. గ్రామ, వార్డు సచివాలయాల శాఖను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. సచివాలయాల్లో పని చేసే ఉద్యోగులకు సెలవు మంజూరు అధికారాన్ని సర్పంచులకు కల్పిస్తున్నట్లు పంచాయతీ ఎన్నికల ముందు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు పూర్తయ్యాక జీవోలో సవరణలు చేసింది. ఉద్యోగులపై పర్యవేక్షణ బాధ్యత పూర్తిగా అధికారుల చేతుల్లో పెట్టింది. ప్రభుత్వ అసంబద్ధ నిర్ణయాల కారణంగా వాలంటీర్లు కూడా తమ మాట వినడం లేదేని శ్రీకాకుళం జిల్లాకు చెందిన సర్పంచి ఒకరు వాపోయారు.

ఇదీ చదవండి: పంచాయతీ నిధులను వాడుకోవటాన్ని నిరసిస్తూ.. సర్పంచ్​ల భిక్షాటన

Last Updated : Apr 6, 2022, 6:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.