ETV Bharat / city

నిర్ణీత ధరకే ఇసుక విక్రయాలు.. ప్రభుత్వం ఆదేశాలు - ఇసుక అమ్మకాలపై ధర నిర్ణయించిన ప్రభుత్వం

ఇసుక తవ్వకాల టెండర్‌ దక్కించుకున్న ప్రైవేటు సంస్థ తాము నిర్ణయించిన ధరకే అమ్మాలని ప్రభుత్వం ఆదేశించింది. అవసరమైన వారెవరైనా రీచ్‌లు, స్టాక్‌పాయింట్ల వద్దే నేరుగా కొనుగోలు చేయవచ్చని స్పష్టంచేసింది. ఇసుక తవ్వకాలు, విక్రయాలపై ప్రైవేటు సంస్థతో ఒప్పందం చేసుకుంది.

Sand sales at fixed price
నిర్ణీత ధరకే ఇసుక విక్రయాలు
author img

By

Published : Apr 17, 2021, 10:38 AM IST

నిర్ణీత ధరకే ఇసుక విక్రయాలు

రాష్ట్రంలో జోన్ల వారీగా ఇసుక తవ్వకాలు, విక్రయాల బాధ్యతలు చేపట్టే ఏజెన్సీ, లీజుదారుడు.. రీచ్‌లు, స్టాక్‌ పాయింట్ల వద్ద నిర్ణయించిన ధరకే విక్రయించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఏజెన్సీ పాటించాల్సిన నిబంధనలను, ప్రస్తుతమున్న ఇసుక మైనింగ్‌ విధానంలో సవరణలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో కొన్ని వర్గాలకు ఇచ్చిన రాయితీలు, వెసులుబాట్లలో మార్పులు చేయగా, మరికొన్నింటిని తొలగించింది. రీచ్, స్టాక్‌ పాయింట్‌ వద్దకు వచ్చిన వినియోగదారుడు నచ్చిన ఇసుకను ఎంపిక చేసుకొని, సొంత వాహనంలో తీసుకెళ్లవచ్చని స్పష్టంచేసింది.

వాహనాలను అందుబాటులో ఉంచాలి..

వినియోగదారుడు అభ్యర్థిస్తే ఇసుక సరఫరా చేసేందుకు రీచ్‌ల వద్ద 20 వాహనాల చొప్పున అందుబాటులో ఉంచాలని నిర్దేశించింది. ఇలా రవాణా చేసినందుకు ఎంత వసూలు చేయాలనేది ప్రభుత్వమే నిర్ణయిస్తుందని.. అధిక ధరకు ఇసుక విక్రయిస్తే టన్నుకు 2వేల చొప్పున జరిమానా విధిస్తామని హెచ్చరించింది. కొనుగోలు చేసినవారు అవసరాలకు మించి నిల్వ ఉంచకూడదని, ఇతరులకు విక్రయించకూడదని స్పష్టంచేసింది. వర్షాకాలం కాని సమయంలో మొత్తం రీచ్‌ల్లో 70 శాతం పని చేస్తుండాలని... జులై, ఆగస్టు, సెప్టెంబరు నెలల అవసరాలకు తగినట్లుగా జూన్‌ చివరి నాటికే నిల్వ చేసుకోవాలని స్పష్టంచేసింది. సంబంధిత వివరాలను గనుల శాఖకు తెలియజేయాలని.. నదుల మధ్యలో ఉండే ఇసుకను తవ్వి తెచ్చే బోట్స్‌మెన్‌ సొసైటీలకు ఉపాధి చూపాలని నిబంధన విధించింది. లీజుకు సరిహద్దు రాళ్లు ఏర్పాటు చేయాలని, దానికి బయట తవ్వకాలు చేయకూడదని నిర్దేశించింది. ప్రతి రీచ్‌లో ఇసుక తవ్వకాలు, విక్రయాల వివరాలు రోజూ రికార్డుల్లో నమోదు చేయాలని ఉత్తర్వుల్లో తెలిపింది.

జీపీఎస్ తప్పనిసరి

రీచ్‌లు, స్టాక్‌ పాయింట్లు, తవ్వకాలు, విక్రయాలను తనిఖీ చేసే అధికారం.. గనులు, ఎస్​ఈబీ, పోలీసుశాఖ అధికారులకు ఉంటుందని ప్రభుత్వం స్పష్టంచేసింది. అధికారులకు ఏజెన్సీలు సహకరించాలని సూచించింది. ఇసుక రవాణా చేసే వాహనాలకు జీపీఎస్ తప్పనిసరిగా ఉండాలన్న ప్రభుత్వం... ఆ సమయంలో వే-బిల్లు, ఇన్వాయిస్‌ ఇవ్వాలని చెప్పింది. షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లోని రీచ్‌లలో గిరిజన సొసైటీల ఆధ్వర్యంలోనే తవ్వకాలు జరగాలని.. నదుల సమీప గ్రామాలవారు సొంతానికి ఇసుక అవసరమైతే ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లలో ఉచితంగా తీసుకెళ్లవచ్చని గత ఉత్తర్వుల్లో ఉంది. తాజాగా దాన్ని సవరించి ట్రాక్టర్లను తొలగించింది.

నదులకు 5 కిలోమీటర్ల పరిధిలో ఉండే గ్రామాలకు ఉచిత ఇసుక అని గతంలో ఉత్తర్వులు ఉండగా... దాన్ని తొలగించి నదులకు సమీప గ్రామాలు మాత్రమే అని పేర్కొంది. నదులకు సమీప గ్రామాల్లో బలహీనవర్గాల ఇళ్ల నిర్మాణం, పునరావాస ప్యాకేజీ కింద చేపట్టే నివాస కట్టడాలకు ఉచితంగా ఇసుక సరఫరా చేయాలని గతంలో ఉత్తర్వులు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఇసుకకు సీనరేజ్‌ ఛార్జి, జిల్లా ఖనిజ నిధి, మెరిట్‌ నుంచి మినహాయింపు ఇచ్చింది. ఇసుక తవ్వకానికయ్యే వ్యయాన్ని లబ్ధిదారుడే భరించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి:

పోలవరం: వరద సమయంలో అధిక నీటిని ఒడిసిపట్టేలా..

గోడ కూలి.. ముగ్గురు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.