పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో గుత్తేదారు మేఘ సంస్థ, జేపీ వెంచర్స్ మధ్య ఇసుక వివాదం నెలకొంది. పోలవరంలో డయాఫ్రం వాల్ నిర్మాణానికి మేఘ సంస్థ ఇసుకను వాడుతుండగా..తవ్వకాలు జరుపుతున్న రీచ్‌లన్నీ తమవేనని జేపీ వెంచర్స్ అంటోంది.
ఈ మేరకు పోలవరానికి ఇసుక రవాణాను జేపీ వెంచర్స్ సంస్థ ప్రతినిధులు అడ్డుకున్నారు. దీంతో మధ్యాహ్నం నుంచి సుమారు 250 టిప్పర్లు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. పోలవరం ప్రాజెక్టు అధికారులను సైతం జేపీ సంస్థ సిబ్బంది అడ్డుకున్నారు. కాగా.. డయాఫ్రం వాల్‌లో కోటి క్యూబిక్ మీటర్లు అవసరమని మేఘ సంస్థ అంటోంది. ఇసుక వివాదం వల్ల పోలవరం డయాఫ్రం వాల్ పనులకు ఆటంకం ఏర్పడుతోంది. ఇదిలా ఉండగా..పోలవరం పనులకు ఎలాంటి ఆటంకాలు లేవని అధికారులు అంటున్నారు.
ఇదీ చదవండి : తిరుపతి కలెక్టరేట్‌కు పద్మావతి నిలయం అప్పగింతపై హైకోర్టు స్టే